ETV Bharat / briefs

'అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలు చేయాలి'

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలు చేయాలని బాలవికాస్ పౌండేషన్ నిర్వహకుడు నర ప్రకాశరావు కోరారు.

author img

By

Published : Jun 16, 2019, 5:46 PM IST

బాలవికాస్ ఫౌండేషన్ నిర్వాహకుడు నర ప్రకాశరావు
బాలవికాస్ ఫౌండేషన్ నిర్వాహకుడు నర ప్రకాశరావు

అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలు చేయాలని బాలవికాస్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖలో బాలవికాస్ పౌండేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం సభ్యులు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. అమ్మ ఒడి పథకం అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని బాలవికాస్ ఫౌండేషన్ నిర్వాహకుడు నర ప్రకాశరావు వ్యాఖ్యానించారు. పథకాన్ని ప్రైవేటు పాఠశాలకు వర్తింపచేస్తే ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇదీచదవండి

కర్కష హృదయం... అమ్మకానికి పేగుబంధం!

Intro:కట్ నం : 879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.

( ) అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలు చేయాలని బాలవికాస్ ఫౌండేషన్ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖలో బాలవికాస్ ఫౌండేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో లో సమావేశం నిర్వహించారు.

Body:అమ్మఒడి పథకం ద్వారా బడిలో పిల్లలను చేర్పించే తల్లులకు 15 వేల రూపాయలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామని బాలవికాస్ ఫౌండేషన్ నిర్వాహకుడు నర ప్రకాశరావు అన్నారు. అయితే ఈ పధకాన్ని ప్రైవేటు పాఠశాలలకు వర్తింప చేస్తే ప్రభుత్వ పాఠశాలు మూతపడే ప్రమాదముందని హెచ్చరించారు.

Conclusion:ప్రభుత్వ పాఠశాలలకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేయడం వల్ల మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు నెలకొల్పే అవకాశం ఉంటుందని, ఇందుకు తగ్గ సమాచారాన్ని సేకరించేందుకు ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రకాశరావు కోరారు.

బైట్: నరవ ప్రకాశరావు, నిర్వాహకుడు, బాల వికాశ్ ఫౌండేషన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.