ప్రపంచంలోని సుసంపన్నుల్లో ఒకరైన అమేజాన్ సీఈఓకు అమెరికా మీడియాపై కోపమొచ్చింది. వ్యాఖ్యాత లారెన్ సాంచెజ్కు తనకి మధ్య జరిగిన వ్యక్తిగత సంక్షిప్త సందేశాలను (పర్సనల్ మెసేజ్) నేషనల్ ఎంక్వైరర్ ఆఫ్ 'బ్లాక్మెయిల్' ప్రచురించిన అంశంపై జెఫ్ బెజోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పొందారన్న అంశంపై సొంత దర్యాప్తునూ చేస్తామని తన బ్లాగ్ వేదికగా పేర్కొన్నారు. ఏఎంఐ పంపిన ఈమెయిల్స్నూ బ్లాగ్‌లో జతచేశారు అమెజాన్ బాస్.
దర్యాప్తును ఆపకపోతే శాంచెజ్‌తో దిగిన ఫోటోలనూ బయటపెడతామని అమెరికన్ మీడియా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ తన న్యాయవాదికి హెచ్చరికలు పంపినట్లు బెజోస్ తెలిపారు.
" సమాచార బహిర్గతంపై దర్యాప్తును ఆపాలని డేవిడ్ పెక్కర్ కు చెందిన ఎంక్వైరర్ పబ్లిషర్ అమెరికన్ మీడియా(ఏఎమ్ఐ) నన్ను సంప్రదించింది. దర్యాప్తును ఆపకపోతే వ్యక్తిగత ఫోటోలనూ ప్రచురిస్తామని హెచ్చరించింది. రాజకీయ నేతల ప్రోద్బలంతోనో లేదా రాజకీయ కుట్రతోనో ఇదంతా చేస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని బహిరంగ ప్రకటన చేయాలని కోరింది."
- జెఫ్ బెజోస్, అమేజాన్ సీఈఓ
ఈ వ్యవహారం వెనుక ఏవో రాజకీయ శక్తులున్నాయని జెఫ్ బెజోస్ భద్రత సలహాదారుడు గావిన్ డీ బెక్కర్ ఇటీవల డైలీ బీస్ట్ ఇంటర్వూలో తెలిపారు.
" రాజకీయ శక్తులు ఇదంతా చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుదారుడైన సాంచెజ్ తమ్ముడు మైఖేల్పైనా అనుమానాలున్నాయి. "
-గావిన్ డీ బెక్కెర్, జెఫ్ బెజోస్ భద్రతా సలహాదారులు