ETV Bharat / briefs

ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు: అమర్​నాథ్​రెడ్డి

ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన... ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత చెత్తగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని మండిపడ్డారు.

మంత్రి అమర్​నాథ్​రెడ్డి
author img

By

Published : Apr 16, 2019, 10:07 PM IST

మంత్రి అమర్​నాథ్​రెడ్డి

ప్రణాళికతోనే రాష్ట్రానికి తక్కువ బలగాలను పంపారన్నారు మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా అన్ని విధాలా అడ్డుపడ్డారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సహనంతో ప్రజలు ఓటేశారని అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. వీవీ ప్యాట్‌లో 3 సెకన్లకు మించి గుర్తు కనిపించలేదన్న ఆయన... 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించమంటే ఈసీ ఎందుకు ఉలిక్కి పడుతుందని ప్రశ్నించారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు.

మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారని అభిప్రాయపడ్డారు. ఈవీఎంల నిర్వహణ, ఎన్నికల సంఘం తీరు దారుణమని పేర్కొన్నారు. మహిళలు అర్ధరాత్రి వరకు సహనంతో నిలబడి తెదేపాకు ఓట్లేసి చంద్రబాబు రుణం తీర్చుకున్నారన్నారు. 115 నుంచి 130 సీట్లతో తెదేపా తిరిగి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఓటింగ్ శాతం తగ్గించేందుకు వైకాపా దాడులు చేసిందని ఆరోపించారు. ఏపీ ప్రజలు బిహార్ ప్రణాళికుల వ్యూహాలను తిప్పికొట్టారని అమర్​నాథ్​రెడ్డి అన్నారు.

ఇవీ చూడండి : 'మీ రాజకీయాలకు నన్ను బలి చేయొద్దు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.