తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలలో వరి సాగు చేస్తున్న రైతులు, నారుమళ్లు వేసి నీరందక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ఒక మోస్తరు వర్షాలు కురవడంతో కాలువలకు నీరు వదిలారు. వారం పది రోజుల తర్వాత పంట కాలువలకు నీరు చేరిందన్న సంతోషం నిలువకముందే, ఆ నీటిని మరో రెండు వారాల పాటు తాగునీటి అవసరాల కోసం చెరువులకు మళ్ళించాలనీ అధికారులు సూచించారు.దీంతో రైతులు ఎవరు నారుమళ్ళు వేసేందుకు ముందుకు రాలేకపోతున్నారు. 20 శాతం మాత్రమే రైతుల నారుమళ్లు వేయగా, మిగిలిన వారు ఆశించినంత వర్షాభావం లేకపోవడంతో ఎండిన చేలను దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధం చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా కాలువ నీరు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసిన నారుమడులు ఎండి పోతుండగా మరి కొందరు రైతులు ఇంజన్ల ద్వారా నీటిని తోడి కాపాడుకుంటున్నారు.
ఇదీ చూడండి:13 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్... వివో కొత్త టెక్