ETV Bharat / city

సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత

senior-actor-jayaprakash-reddy-has-passed-away
సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత
author img

By

Published : Sep 8, 2020, 8:06 AM IST

Updated : Sep 8, 2020, 9:56 AM IST

08:05 September 08

సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత

సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత

సినీనటుడు జయప్రకాశ్‌ రెడ్డి (74) కన్నుమూశారు. లాక్‌డౌన్‌ సమయం నుంచి గుంటూరు విద్యానగర్‌లో ఉంటున్న ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుతో స్నానాల గదిలోనే కుప్పకూలారు. జయప్రకాశ్‌రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల. నాటకరంగంపై ఉన్న మక్కువతో ఆయన గుంటూరులోనే స్థిరపడ్డారు. 1946 మే 8న జన్మించిన ఆయన బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. దాదాపు వందకు పైగా తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించారు. పలు చిత్రాల్లో ప్రతినాయకుడు, హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. రాయలసీమ యాసలో సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.

ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్న కేశవరెడ్డి, పలనాటి బ్రహ్మనాయుడు, నిజం, సీతయ్య, ఛత్రపతి, బిందాస్‌, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, బాద్‌షా, రేసు గుర్రం, మనం, పటాస్‌, టెంపర్‌, సరైనోడు, ఖైదీ నంబర్‌ 150, జై సింహా, రాజా దిగ్రేట్‌ తదితర చిత్రాలు నటించారు. జయప్రకాశ్‌రెడ్డి చివరి సారిగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు. గుంటూరు వేంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రతివారం జరిగే నాటకాల ప్రదర్శనలో పాల్గొనే జయప్రకాశ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు సినీ, నాటకరంగ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయప్రకాశ్‌రెడ్డి కుమారుడు, కోడలు కొవిడ్‌ కారణంగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన సన్నిహితులు, బంధువులు జయప్రకాశ్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జయప్రకాశ్‌ మృతి వార్త తెలుసుకున్న ఆయన సన్నిహితులు, కళాకారులు విద్యానగర్‌లోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఎక్కువ మంది గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Last Updated : Sep 8, 2020, 9:56 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.