కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ కారణంగా..రాష్ట్రం ఆదాయంలో భారీగా కోత పడుతోంది. ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోనుంది. పెట్రోలు, డీజిల్‌పై ఐదు, పది రూపాయల చొప్పున కేంద్రం తగ్గింపు వల్ల..ఆ మేరకు రాష్ట్రంలో పెట్రోలు లీటరుపై రూపాయి 51పైసలు, డీజిల్‌పై 2రూపాయల 22 పైసల మేర వ్యాట్ తగ్గింది. ఏడాదికి డీజిల్‌పై 888 కోట్ల రూపాయలు, పెట్రోలుపై 226కోట్ల మేర వ్యాట్ ఆదాయం తగ్గనుంది.
కేంద్రం తగ్గించిన ఎక్సైజు పన్నుతో వ్యాట్ మూలధరలో వచ్చిన మార్పుల కారణంగా మొత్తంగా ఏడాదికి 1114 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయంలో తగ్గుదల నమోదు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీచదవండి.