పాఠశాల స్థలాల్లో ఆర్‌బీకేలు, సచివాలయాల నిర్మాణంపై హైకోర్టు (AP high court) విచారణ జరిగింది. ఏడుగురు ఐఏఎస్ అధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. మొత్తం1160 చోట్ల ఆర్‌బీకేలు, సచివాలయాలు నిర్మించినట్లు ప్రభుత్వం.. ధర్మాసనానికి తెలిపింది. 450 నిర్మాణాలను మరో చోటకు తరలించినట్లు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
మిగతా నిర్మాణాలను 4 వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబరు 1కి వాయిదా పడింది. ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, బి.రాజశేఖర్, వి.చినవీరభద్రుడు, శ్యామలారావు, విజయ్‌కుమార్, ఎం.ఎం.నాయక్ హైకోర్టుకు హాజరయ్యారు.
ఇదీ చదవండి:
Corona cases: కరోనా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ