ETV Bharat / city

PRC in Andhra Pradesh: పీఆర్‌సీ ప్రకటిస్తాం.. కానీ నివేదిక ఇవ్వలేం: కార్యదర్శుల కమిటీ - cm jagan

PRC in Andhra Pradesh
PRC in Andhra Pradesh
author img

By

Published : Dec 3, 2021, 6:00 PM IST

Updated : Dec 3, 2021, 7:22 PM IST

17:53 December 03

ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమన్న అధికారులు

PRC in Andhra Pradesh : ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం ముగిసింది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో.. పీఆర్సీ సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా.. నివేదికలోని సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులు వెల్లడించారు.

పీఆర్సీ నివేదిక ఇవ్వలేం..
Joint Staff Council meeting: ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని కార్యదర్శుల కమిటీ స్పష్టం చేసింది. పీఆర్‌సీపై సీఎం జగన్‌ తిరుపతిలో ప్రకటన చేశారని... ఈ మేరకు పది రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని వెల్లడించింది. దీనిపై స్పందించిన ఉద్యోగ సంఘాలు.. పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని..? ప్రశ్నించారు. ఫలితంగా కార్యదర్శుల కమిటీ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది.

bopparaju venkateswarlu on PRC Report: పీఆర్సీ ఒక్కటే కాదు.. చాలా అంశాలు ఉన్నాయి - బొప్పరాజు

'కార్యదర్శుల కమిటీ వద్ద ఎలాంటి సమాచారమూ లేదు. పీఆర్సీ నివేదిక ఇవ్వకపోతే ఎలా? పీఆర్సీ అంటే ఫిట్‌మెంట్‌ ఒక్కటే కాదు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇంక్రిమెంట్లు చాలా ఉంటాయి. ఈ అంశాలపై సమాచారం లేదు. పీఆర్సీ నివేదిక ఇచ్చే విషయంలో స్పష్టత లేదు. నివేదిక లేకుండా పీఆర్సీ ప్రకటిస్తే అంగీకరించబోం. నివేదిక ఇచ్చి చర్చలు జరపాలి. తెలంగాణలో నివేదికపై చర్చ జరిగాకే పీఆర్సీ ఇచ్చారు' - బొప్పరాజు వెంకటేశ్వర్లు

కమిటీది కాలయాపనే - బండి శ్రీనివాసరావు
Bandi Srinivasa Rao comments on PRC: 71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మళ్లీ ఇచ్చామని ఉద్యోగ సంఘ నేత బండి శ్రీనివాసరావు వెల్లడించారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. ఏదో ఒకటి చెప్పేవరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

తిరుపతిలో సీఎం జగన్ ఏమన్నారంటే..
CM Jagan announcement on PRC: పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో ఉండగా.. కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని గమనించిన ముఖ్యమంత్రి.. వారిని పిలిచి మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. ఇందుకు స్పందించిన సీఎం జగన్.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. 10 రోజుల్లో ప్రకటన ఉంటుందని వారికి తెలిపారు.

ఇదీ చదవండి

CM Jagan On PRC: ఉద్యోగులకు సీఎం జగన్​ గుడ్​ న్యూస్​

Last Updated : Dec 3, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.