ETV Bharat / bharat

సెలవులే లేని బడి.. రోజుకు 12 గంటలు క్లాసులు.. వాళ్ల ట్యాలెంట్ చూస్తే.. - సెలవులు లేని పాఠశాల

ఈ పాఠశాల 365 రోజుల పాటు ఒక్కరోజు సెలవు లేకుండా నడుస్తూ.. అనేక మందికి ఆదర్శంగా నిలుస్తోంది ఓ పాఠశాల. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన స్కూల్​.. రాత్రి 8 గంటల వరకు కొనసాగుతోంది. ఈ స్కూల్​లో ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడ ఉందంటే?

School with no holidays
School with no holidays
author img

By

Published : Nov 30, 2022, 8:44 PM IST

Updated : Dec 1, 2022, 10:49 AM IST

సెలవులే లేని బడి

స్కూల్​ అనగానే ప్రతి ఆదివారం సెలవు.. మధ్యలో పండుగలకు ఓ పది రోజుల సెలవులు.. వేసవి సెలవుల సంగతి సరేసరి. కానీ ఈ పాఠశాలలో అవేవీ ఉండవు. సంవత్సరంలో ఉన్న 365 రోజులు రావాల్సిందే. అది కూడా రోజుకు 12 గంటలు. అదే ఆ బడి ప్రత్యేకత.

మహారాష్ట్రలోని నాశిక్​ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలోని ఉంది ఈ పాఠశాల. ఈ స్కూల్​ ఏడాదిలో 365 రోజులు.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తోంది. త్రయంబకేశ్వర్​ తాలుకాలోని హివాలి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్​ స్కూల్​లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1 నుంచి 5వ తరగతి పిల్లలు సుమారు 1000 ఎక్కాలను ఒకేసారి రెండు చేతులతో అవలీలగా రాసేస్తున్నారు. జనరల్​ నాలెడ్జ్​తో పాటు రాజ్యాంగంలోని అన్ని క్లాజులు, జాతీయ రహదారుల పేర్లు చెబుతున్నారు. వీటితో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు.. వాటి రాజధానులు పేర్లను పుస్తకాలు చూడకుండానే అప్పగించేస్తున్నారు. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షల్లో అడిగే గణితం, లాజికల్​ ప్రశ్నలకు తక్కువ వ్యవధిలోనే సరైన సమాధానాలు చెప్పేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్​షిప్​ ప్రవేశ పరీక్షల్లోను సత్తా చాటుతున్నారు ఇక్కడి విద్యార్థులు.

School with no holidays
రెండు చేతులతో ఎక్కాలు రాస్తున్న విద్యార్థులు

కేశవ్​ గావిత్​​ అనే ఉపాధ్యాయుడు ఈ పాఠశాలలో మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని విషయాలనే బట్టీ పట్టకుండా.. ఉద్యోగ నైపుణ్యాలపై దృష్టి పెట్టేలా కృషి చేశారు. 8గంటలు పుస్తకాల్లో ఉన్న విషయం చెప్పి.. ఆ తర్వాత 4 గంటలపాటు ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఉపయోగపడేలా ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్​, కార్పెంటర్​, పెయింటింగ్​ లాంటి పనుల్లో శిక్షణ ఇస్తున్నారు. వీరందరికీ రెండు పూటలా భోజన వసతి కల్పిస్తున్నారు.

School with no holidays
రెండు చేతులతో రాస్తున్న విద్యార్థులు

ఇవీ చదవండి: నాలుగు రాష్ట్రాలు.. ఆరు పెళ్లిళ్లు.. రైల్వే స్టేషన్​లో ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్ హైడ్రామా

కుమారైను గర్భవతి చేసిన తండ్రికి 20 ఏళ్లు జైలు.. క్షమించి వదిలేయాలన్న బాధితురాలు.. చివరకు..

Last Updated : Dec 1, 2022, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.