ETV Bharat / bharat

Palnadu District: "అరాచకాలకు చిరునామా.. ఆంధ్రా చంబల్‌లోయ".. అక్కడ బతకాలంటే ప్రజాప్రతినిధికి జీ హుజూర్‌ అనాల్సిందే

author img

By

Published : Jun 30, 2023, 7:28 AM IST

Updated : Jun 30, 2023, 2:01 PM IST

YSRCP Leaders in Palnadu district: విక్రమార్కుడు సినిమాలోని చంబల్‌లోయ ఎపిసోడ్‌ను ఎవరూ మర్చిపోరు! KGF చిత్రంలోని చీకటి ప్రపంచాన్ని గమనించే ఉంటారు కదా...? వాటికి మించి ఉంటుంది మన రాష్ట్రంలోని ఆ నియోజకవర్గం. అక్కడ ఆ ప్రజాప్రతినిధే డాన్‌. ఆయన చెప్పిందే వేదం. అక్కడ బతకాలంటే జీ హుజూర్‌ అనాల్సిందే. దేనికైనా కప్పం కట్టాల్సిందే. ఆయన గీసిన గీత దాటారా.. దాడులుతో బెంబేలెత్తిస్తారు. ఆస్తులు లాగేసుకుంటారు. పోలీసుల్ని పంపి కేసులు పెట్టి వేధిస్తారు. ఐనా మాట వినకపోతే.. ఫైనల్‌గా.. శాల్తీ గల్లంతే! వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తంతు.

YSRCP Leaders in Palnadu district
YSRCP Leaders in Palnadu district

YSRCP Leaders in Palnadu district: ఆంధ్రా చంబల్‌లోయగా ప్రసిద్ధి చెందిన పల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధికి, ఆయన అరాచకాలకు అంతే లేదు. శాంతిభద్రతలకు, చట్టనిబంధనలకు చోటే లేదు. ఆ ప్రజాప్రతినిధి, ఆయన అనుచర గణం చెప్పిందే చట్టం. చేసిందే శాసనం. చెప్పాలంటే అదో అనాగరిక, ఆటవిక రాజ్యం.

అరాచకాలకు చిరునామా.. ఆంధ్రా చంబల్‌లోయ.. అక్కడ బతకాలంటే ప్రజాప్రతినిధికి జీ హుజూర్‌ అనాల్సిందే

2019లో వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల గొంతులు కోయడం, విపక్ష పార్టీ జెండా పట్టుకుంటే ఇళ్లు, దుకాణాలు తగలబెట్టేయడం, స్టేషన్‌కి వెళ్లే బాధితులపైనే హత్యాయత్నం వంటి కేసులు పెట్టడం, ఎన్నికల్లో నామినేషన్‌ వేద్దామనుకున్న ప్రతిపక్షాలను బెదిరించి అక్రమ కేసులు పెట్టించి, ఊళ్ల నుంచి వెళ్లగొట్టడం, సహజ సంపదను అడ్డగోలుగా దోచేయడం, భూముల ఆక్రమణలు, ఆస్తుల కబ్జాలు.. ఇలా అక్కడ జరగని అరాచకం లేదు.

ఇవేమీ పట్టించుకోని సీఎం జగన్‌.. ఆయన పనితీరును మెచ్చి మరో పదవినీ కట్టబెట్టారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే తప్పు అని చెప్పి కట్టడిచేయనప్పుడు మనకెందుకులే అనుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. చేయీచేయీ కలిపి ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తుంటారు. దోచుకోవడమే తప్ప.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న కనీస స్పృహ లేని ఆ ప్రజాప్రతినిధి, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా.. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నా.. అది కోస్తా జిల్లాల్లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోతోంది. అక్కడో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఏళ్లతరబడి ఫైళ్లు దాటి ముందుకు సాగలేదు.

అన్నదమ్ముల అరాచకాలు: వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చినప్పటి ఆ నియోజకవర్గంలో ఆ ప్రజాప్రతినిధి, ఆయన సోదరుడి అరాచకాలకు అంతే లేదు. అసాంఘికశక్తుల్ని పెంచి పోషిస్తూ, నియోజకవర్గాన్ని నేర సామ్రాజ్యంగా మార్చేశారు. గనులు వంటి సహజవనరులేవీ ప్రజలకు, ప్రభుత్వానికి దక్కకుండా వైఎస్సార్​సీపీ నాయకులే దోచేసుకుంటారు. మారుమూల గ్రామంలోని ఒక వ్యక్తి ఇంటి స్థలాన్ని మెరక చేసుకోవడానికి ట్రాక్టర్‌తో గ్రావెల్‌ తోలుకోవాలన్నా ఆ ప్రజాప్రతినిధి మనుషుల అనుమతి ఉండాల్సిందే.

తెలుగుదేశం మద్దతుదారులెవరైనా రెండు ట్రాక్టర్ల గ్రావెల్ తెచ్చుకున్నా, కేసులు పెట్టి, అరెస్ట్ చేయించి, చిత్రహింసలు పెడతారు. అక్కడ అన్ని పదవులు, కాంట్రాక్టులూ వాళ్లకే దక్కాలి. వ్యాపారాలూ వాళ్లే చేయాలి. నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అన్నదే ఉండకూడదు. ఎవరైనా ప్రశ్నించినా, ఎదిరించినా చావడానికి సిద్ధంగా ఉండాలి. వీలైతే వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ ఎవరూ పోటీ చేయనంతగా భయోత్పాతం సృష్టించి, ఏకగ్రీవం చేసుకోవాలన్నట్టుగా వారి ఎత్తుగడలు సాగుతున్నాయి. తాజాగా నియోజకవర్గంలోని ఒక మండల తెలుగుదేశం అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది. ఇలాంటి ఘటనలు అక్కడ నిత్యకృత్యం..

అక్రమ మద్యం వ్యాపారం.. తమ్ముడిదే రాజ్యం!: నియోజకవర్గంలో ఆ ప్రజాప్రతినిధి తమ్ముడి కనుసన్నల్లో అక్రమ మద్యం వ్యాపారం మూడు సీసాలు, ఆరు గ్లాసులుగా వర్ధిల్లుతోంది. ప్రతి గ్రామంలోనూ మూడు నాలుగు బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ప్రభుత్వ దుకాణాలకు వచ్చిన మద్యాన్ని సొంత బార్లు, బెల్ట్ షాపులకు తరలించి ప్రతి సీసాపై 60 నుంచి 120 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆ ప్రజాప్రతినిధికి మంత్రి పదవి వస్తుందని కాన్వాయ్‌ కోసం ఆరు కొత్త వాహనాలు కొన్నారు. ఇప్పటికీ టీఆర్‌ నంబర్లతోనే తిరుగుతున్న ఆ వాహనాల్లోనే తెలంగాణ నుంచి మద్యం తెచ్చి, పల్నాడు జిల్లాల్లో అక్రమంగా విక్రయిస్తున్నారు. రోజూ లక్షల్లో పోగేసుకుంటున్నారు.

దుర్గి మండలం అడిగొప్పులలో నిదానంపాటి అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలోనే సారా సీసాలు వేలాడదీసి అమ్ముతున్నా పోలీసులు పట్టించుకోరు. గంజాయి, గుట్కా వ్యాపారాలు, పేకాట క్లబ్బులూ ఇవన్నీ వైఎస్సార్​సీపీ నాయకులే చేస్తున్నారు. గతేడాది వెల్దుర్తి మండలంలో అధికార పార్టీ నాయకుడు ఒకరి దగ్గర పది కిలోల గంజాయి పట్టుబడింది.

కప్పం కడితేనే గ్రానైట్‌ లారీ కదిలేది!: బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్పాడు జిల్లాల నుంచి గ్రానైట్ లారీలు ఆ నియోజకవర్గం మీదుగా తెలంగాణకు వెళతాయి. లారీ ఆ నియోజకవర్గంలోకి ప్రవేశించిన దగ్గర ప్రజాప్రతినిది మనుషులుంటారు. లారీ డ్రైవర్ వారికి 12 వేలు కప్పం కట్టాలి. అది కట్టేస్తే ఆ లారీని నియోజకవర్గంలో పోలీసులు గానీ, చెక్‌పోస్టు సిబ్బంది గానీ అడ్డుకోరు. కట్టబోమని మొండికేస్తే.. నియోజకవర్గ సరిహద్దు దాటక ముందే అధికారులతో దాడులు చేయించి, ఏదో ఒక వంకతో లక్షల్లో జరిమానా విధిస్తారు. కప్పం కింద రోజుకు సుమారు 10 లక్షల చొప్పున ఏడాదికి 36 కోట్లు వసూలు చేసి, అప్పనంగా సంపాదిస్తున్నారన్న మాట. దీని గురించి ఎవరైనా మాట్లాడినా, ఫొటోలు, వీడియోలు తీసినా వారిని బెదిరిస్తున్నారు.

అంతులేని దోపిడీ.. భూ కబ్జాలు!: నియోజకవర్గంలో నర్సరీలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిరాకరిస్తే దాడులు చేయించి, మూయిస్తారు. ఒక గ్రామంలో తెలుగుదేశం సానుభూతిపరుడికి చెందిన నర్సరీని వైఎస్సార్​సీపీ ఎంపీపీ కుమారుడు మూయించగా... యజమాని 4 లక్షలు ఇచ్చుకున్నాకే మళ్లీ ఆనుమతిచ్చారు. అదే గ్రామంలో తెలుగుదేశం మద్దతుదారులకు చెందిన పురుగుమందుల దుకాణంపై దాడులు చేయించి.. 10 లక్షలైనా కట్టండి, పార్టీ అయినా మారండని బెదిరించారు. చేసేదిలేక 3 నెలల క్రితం వారు వైఎస్సార్​సీపీలో చేరిపోయారు.

నియోజకవర్గ కేంద్రంలో ఖాళీ స్థలం కనపడితే చాలు వైఎస్సార్​సీపీ నాయకులు వారి పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించుకుంటున్నారు. స్థలం యజమానులు.. ఆ స్థానిక ప్రజాప్రతినిధినో, ఆయన తమ్ముడినో కలిసి కప్పం కడితేనే స్థలం తిరిగి వచ్చినట్లు. పట్టణంలో ఒక వ్యక్తి చనిపోతే సమీప బంధువుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి 10 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా ఆస్తి విషయంలో అన్నదమ్ములు గొడవపడినా వైఎస్సార్​సీపీ వాళ్లు వాలిపోయి వివాదాన్ని పెద్దది చేసి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు..

అపార్ట్‌మెంట్‌ కడితే... రూ.30 లక్షలు ఇవ్వాల్సిందే!: నియోజకవర్గంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం, దుకాణం ప్రారంభిస్తే సదరు ప్రజాప్రతినిధిని పిలవడంతో పాటు ఆయనకు, ఆయన సోదరుడికి బహుమతులు సమర్పించుకోవాల్సిందే. ఎవరైనా బిల్డర్‌ అపార్ట్‌మెంట్‌ కట్టాలంటే ప్రజాప్రతినిధికి ముందుగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కప్పం కడితేనే అనుమతులు వస్తాయి. లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలన్నా, మున్సిపాలిటీ, ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో పనులు చేయాలన్నా ఆయనకు పర్సంటేజీ ఇవ్వాల్సిందే.

రేషన్‌ బియ్యం సేకరణ, రవాణా ఒక్కో మండలంలో ఒక్కో నేతకు అప్పగించి నెలవారీ కప్పం కట్టించుకుంటున్నారు. ప్రజాప్రతినిధి కార్యక్రమం తలపెట్టినా మిల్లర్లు లక్ష చొప్పున సమర్పించుకోవాలి. చివరకు ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే డబ్బుల్లోనూ వైఎస్సార్​సీపీ నాయకులు కమీషన్లు కొట్టేస్తున్నారు.

ప్రభుత్వ భూములు కనిపిస్తే.. మింగేస్తారు!: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారంగా కొన్ని దశాబ్దాల క్రితం అక్కడికి దగ్గరలోని ఎయిర్‌స్ట్రిప్‌ పక్కనే భూములు కేటాయించారు. ప్రజాప్రతినిధి మనుషులు అందులో సుమారు 200 ఎకరాలను ఆక్రమించినట్టు ఆరోపణలున్నాయి. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక మలేసియా కంపెనీకి.. ఆ నియోజకవర్గంలో పరిశ్రమ ఏర్పాటు కోసం 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఆ భూమిని గుప్పిట పెట్టుకున్న ప్రజాప్రతినిధి అనుచరులు దాన్ని కంపెనీకి అప్పగించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే ఒకరు "ప్రజాప్రతినిధితో రాయబారం నెరిపినా, ఫలితం లేదని తెలిసింది. ఆత్మకూరు చెరువులోని మట్టిని ఇటుక బట్టీలకు అమ్మేసుకుంటూ అధికార పార్టీ నాయకులు ఏటా కోటి వరకు సంపాదిస్తున్నారు.

2019లో వైఎస్సార్​సీపీ అధికారం చేపట్టగానే వైఎస్సార్​సీపీ ముఠాలు తెలుగుదేశం మద్దతుదారుల్ని గ్రామాల నుంచి తరిమికొట్టాయి. హత్యలకు తెగబడ్డాయి. ఆత్మకూరులో తెలుగుదేశం మద్దతుదార్లపై వైఎస్సార్​సీపీ శ్రేణులు దాడికి పాల్పడుతుండటంతో వందల కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వారిని పరామర్శించేందుకు వెళ్లబోతే పోలీసులు ఉండవల్లిలోని ఆయన ఇంటి గేటును తాళ్లతో కట్టేసి, బయటకు కదలనివ్వలేదంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా వైఎస్సార్​సీపీ మూకల నుంచి దాడులు ఆగకపోవడంతో దుర్గి మండలం జంగమహేశ్వరంపాడు, వెల్దుర్తి మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడెంలోని తెలుగుదేశం మద్దతుదారులు కుటుంబాలతో గ్రామాలు విడిచి వెళ్లిపోయారు. ఒత్తిడి తట్టుకోలేక మరికొందరు వైఎస్సార్​సీపీలో చేరారు.

2022జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం నాయకుడు చంద్రయ్యను వైఎస్సార్​సీపీ నాయకులు పట్టపగలే నడిరోడ్డుపై పీక కోసి చంపేశారు. జూన్‌లో దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో ప్రతిపక్ష పార్టీ నాయకుడు జల్లయ్యను గ్రామ వైఎస్సార్​సీపీ నాయకుడు హత్య చేశారు. గత డిసెంబర్‌లో నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహిస్తుండగా.. వైఎస్సార్​సీపీ నాయకులు తెలుగుదేశం నేతల ఇళ్లు, వాహనాల్ని ధ్వంసం చేశారు. ఆ పార్టీ కార్యాలయానికి నిప్పంటించారు. ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులు చేసి, అరాచకానికి పాల్పడ్డారు..

వైఎస్సార్​సీపీ మాత్రమే ఉండాలి!: నియోజకవర్గంలో వైఎస్సార్​సీపీనే ఉండాలి.. మరో పార్టీ పేరే వినపడకూడదన్నట్టుగా అధికార పార్టీ నాయకుల ఆరాచకాలు సాగుతున్నాయి. ప్రత్యర్థుల్ని బెదిరించి, భయపెట్టి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుని, నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీతోపాటు, అన్ని మండలాల్లో ZPTC, MPTC, సర్పంచి పదవులన్నీ వైఎస్సార్​సీపీకే ఏకగ్రీవం చేసుకున్నారు.

తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడు... ప్రజాప్రతినిధి మనుషుల ఆగడాల్ని గట్టిగా ప్రతిఘటిస్తుండటంతో ఆయనపై దాడులకు తెగబడుతున్నారు. ఆయన వెంట ఉన్న వారిని, క్రియాశీలక నాయకుల్ని భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి వైఎస్సార్​సీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఏదైనా కార్యక్రమం చేపడితే.. ముందే అక్కడ అలజడి సృష్టించి, వారిపై కేసులు పెడుతున్నారు. వారి ఇళ్లలో శుభకార్యాలకు, పార్టీ కార్యక్రమాలకు కరెంట్‌ కట్‌ చేయిస్తున్నారు.

ధ్వంసాలు.. విధ్వంసాలు: గతేడాది జనవరి 2న దుర్గి గ్రామంలో NTR విగ్రహాన్ని జడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరరావు అందరూ చూస్తుండగానే ధ్వంసం చేశారు. మాచర్ల మార్కెట్‌ యార్డ్‌ దగ్గర NTR విగ్రాహ్ని, మరోచోట తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను సైతం ద్వంసం చేశారు. కారంపూడి మండలం మిరియాల గ్రామంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ని ట్రాక్టర్​తో ఊరేగించినందుకు అదే రోజు ట్రాక్టర్‌కు నిప్పు అంటించారు.

తెలంగాణ, ఏపీని అనుసంధానిస్తూ నిర్మిస్తున్న 565 నెంబరు జాతీయ రహదారి ఆ నియోజకవర్గం మీదుగానే వెళుతోంది. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారికి ఇనుప రెయిలింగ్‌ ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం దానికి పసుపు రంగు వేశారు. కానీ అది తెలుగుదేశం జెండా రంగని, ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ దాన్ని మార్పించి నల్లరంగు వేయించడం వారి దాష్టీకానికి పరాకాష్ట.

వైఎస్సార్​సీపీ కార్యకర్తల్లా పోలీసులు: ఇంత జరుగుతున్నా పోలీసులకు ఇవేవీ కనబడవు. ప్రతి స్టేషన్‌లో హోంగార్డుల్లో ఇద్దరు ముగ్గురు ఆ నేత మనుషులుంటారు. అక్కడేం జరిగినా ఎమ్మెల్యేకి చేరవేస్తారు. అందుకే సీఐ, ఎస్సైలు కూడా వారికి భయపడుతుంటారు. వైఎస్సార్​సీపీ నాయకుల ఆరాచకాలపై.. తెలుగుదేశం మద్దతుదారులెవరైనా స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తే, వారిపైనే ఎదురు కేసులు పెడతారు.

5 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున నామినేషన్‌ వేద్దామనుకున్న కొందరు అభ్యర్థులకు పోలీసులే ఫోన్లు చేసి, గంజాయి వ్యాపారం చేస్తున్నావని కేసులు పెడతామని బెదిరించారు.ఒక మండలంలో పోలీసు అధికారి.. వైఎస్సార్​సీపీ వాళ్లపై ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం వాళ్లెవరైనా స్టేషన్‌కి వెళితే ఫిర్యాదు తీసుకోకపోగా వాళ్లు వైఎస్సార్​సీపీలో చేరేవరకు వేధిస్తారు. మండలంలో పార్టీ మారిన వారిలో 85 శాతం మంది ఆయన బాధితులే.

రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు షాదీఖానాలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ఇఫ్తార్‌ విందు ఇవ్వాలనుకుంటే.. అదే రోజు ఆ ప్రజాప్రతినిధి కూడా విందు ఇస్తున్నారంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. తిరునాళ్లకు టీడీపీ నాయకులు వెళ్తుంటే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు అడ్డుకున్నారు. నాలుగేళ్లుగా ఇన్ని అరాచకాలు, దాష్టీకాలు చేస్తున్న ఈ నియోజకవర్గంలో.... అభివృద్ధి మాత్రం మచ్చుక్కైనా కనబడదు. పైగా కోస్తా జిల్లాల్లోనే అత్యంత దుర్భిక్షమైన ప్రాంతంగా ఉంది ఈ నియోజకవర్గం.

Last Updated : Jun 30, 2023, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.