ETV Bharat / bharat

రియల్​ లైఫ్​లో 'ఉప్పెన సీన్'.. ఆమెను ప్రేమించాడని మర్మాంగాన్ని కోసేసి.. - delhi love couple attack

Youth genitals chopped off: ప్రేమించి, పెళ్లి చేసుకోవడమే ఆ యువకుడికి శాపమైంది. తాను వివాహం చేసుకున్న యువతి కుటుంబ సభ్యులు.. అతడ్ని కిడ్నాప్​ చేసి, హింసించి, అతడి మర్మాంగాన్ని కోసేశారు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది.

Youth genitals chopped off, delhi crime news
యువకుడి మర్మాంగాన్ని కోసేసిన కుటుంబం
author img

By

Published : Dec 24, 2021, 1:15 PM IST

Youth genitals chopped off: 'ఉప్పెన' సినిమాలో తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో హీరోయిన్ తండ్రి హీరో మర్మాంగాన్ని కోయిస్తాడు. ఇదే తరహా దారుణ ఘటన దేశ రాజధాని దిల్లీలోనూ వెలుగు చూసింది. తమ ఇంటి అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడని కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు.. యువకుడిపై కర్కశంగా ప్రవర్తించారు. అతడిని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, మర్మాంగాన్ని కత్తిరించారు.

అసలేం జరిగింది?

Delhi crime news: దిల్లీకి చెందిన ఓ యువతి, యువకుడు(22) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ, వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దాంతో వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లి, దిల్లీ బయట వివాహం చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు వారిపై కక్ష పెంచుకున్నారు. పెళ్లి తర్వాత ఆ జంట.. డిసెంబరు 22న తిరిగి దిల్లీకి చేరుకుంది. కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని రాజౌరీ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది.

ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు... పోలీస్​ స్టేషన్​ నుంచి యువకుడు బయటకు రాగానే.. రాజౌరీ గార్డెన్ ఏరియాలో అతడ్ని కిడ్నాప్ చేశారు. తీవ్రంగా దాడి చేశారు. అతని మర్మాంగాన్ని కోసేశారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం సఫ్దార్​జంగ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఇదీ చూడండి: స్టంట్ చేస్తుండగా అదుపు తప్పిన బైక్.. ఎగిరిపడ్డ రైడర్​

ఇదీ చూడండి: బార్​లో పోలీస్ ఇన్​స్పెక్టర్ వీరంగం.. క్యాషియర్​పై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.