Man Attacked By Mob : దొంగతనం చేశాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తి దుస్తులు విప్పి.. కర్రలు, పైపులతో విచక్షణ రహితంగా దాడి చేశారు కొందరు దుండగులు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం పోలీసులు దృష్టికి వెళ్లగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ అభిషేక్ తివారీ.. మోతీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరమ్కాంట ప్రాంతంలో ఈ వీడియోను చిత్రీకరించినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మానస్ ద్వివేది చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
దళితుడితో చెప్పులు నాకించిన వ్యక్తి..
Dalit Man Assaulted : విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. ఒక దళితుడిపై దాడి చేశాడు. అనంతరం తన చెప్పులు నాకించుకుని పాశవికంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అధికారులు విధుల నుంచి తొలగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 6వ తేదీన బాధితుడు రాజేంద్ర చమర్ తన మేనమామ ఇంటికి వెళ్లాడు. అక్కడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సమస్యను గుర్తించడానికి రాజేంద్ర ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న తేజ్‌బాలీ సింగ్ పటేల్ అనే వ్యక్తి.. రాజేంద్రను పరుష పదజాలంతో దూషించాడు. అనంతరం తన చెప్పులను నాకించుకున్నాడు నిందితుడు.
ఆ తర్వాత అతడి చేయిని మెలితిప్పి.. నేలపైకి తోసేశాడు. ఛాతీపై ఎక్కి కొట్టాడు. ఈ క్రమంలో స్థానికులు జోక్యం చేసుకుని బాధితుడిని విడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జులై 8న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. అతడిని ఉద్యోగం నుంచి తీసేశారని వెల్లడించారు.
ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ స్పందించారు. 'ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. డీఐజీని సంఘటనా స్థలాన్ని సందర్శించాలని ఆదేశించాను. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశాము. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.' అని ఆదివారం రాత్రి డీజీపీ ట్వీట్ చేశారు.
-
DGP UP has taken cognizance of the incident and directed the DIG range to visit the scene of the crime. An FIR has been registered under the SC/ST Act, and the accused has been promptly arrested. The DGP has given directions for the strictest legal action against the accused. https://t.co/c0dsYdszhe
— UP POLICE (@Uppolice) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">DGP UP has taken cognizance of the incident and directed the DIG range to visit the scene of the crime. An FIR has been registered under the SC/ST Act, and the accused has been promptly arrested. The DGP has given directions for the strictest legal action against the accused. https://t.co/c0dsYdszhe
— UP POLICE (@Uppolice) July 8, 2023DGP UP has taken cognizance of the incident and directed the DIG range to visit the scene of the crime. An FIR has been registered under the SC/ST Act, and the accused has been promptly arrested. The DGP has given directions for the strictest legal action against the accused. https://t.co/c0dsYdszhe
— UP POLICE (@Uppolice) July 8, 2023
ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం సృష్టించింది. అధికార బీజేపీపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. మధ్యప్రదేశ్‌లో ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన కంటే.. ఇది సిగ్గుచేటు అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ పాలనలో దళితులను మనుషులుగా కూడా పరిగణించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కాంగ్రెస్ హేయమైన చర్యగా అభివర్ణించింది. బీజేపీ దళితులను అవమానించిందని రాష్ట్రీయ లోక్ దళ్ ఆరోపించింది.
కూలీకి నిప్పంటించి యజమాని హత్య..
ఓ కిరాణా దుకాణం యజమాని.. తన వద్ద పనిచేసే కూలీకి నిప్పంటించి హత్య చేశాడు. అనంతరం కరెంట్ షాక్ తగిలి మృతిచెందినట్లుగా చిత్రీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరు సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో తౌసిఫ్ హుస్సేన్ (32) అనే వ్యక్తి కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద గజానన అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో గజాననకు నిప్పంటించి హత్య చేశాడు తౌసిఫ్. అనతంరం బాధితుడు కరెంట్ షాక్‌తో చనిపోయినట్లు చిత్రీకరించి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణ ప్రకారం హత్యగా నిర్ధరించి.. శనివారం నిందితుడిని అరెస్టు చేశారు.