ETV Bharat / bharat

'వీరశైవ లింగాయత్ సంఘాన్ని విడదీసేందుకు సీఎం కుట్ర' - Lingayat communit

వీరశైవ-లింగాయత్ సంఘాన్ని విడదీసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, అతని కుమారుడు బీవై విజయేంద్ర కుట్రపన్నుతున్నారని భాజపా రెబల్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్​ తీవ్ర విమర్శలు చేశారు. స్వయంగా లింగాయత్ అయిన యడియూరప్ప... లింగాయత్​ల ఓబీసీ(2ఏ)స్టేటస్​ గురించి పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.

"Yediyurappa&his son Vijayendra want to divide Veerashaiva- Lingayat community"
'వీరశైవ-లింగాయత్ సంఘాన్ని విడదీసేందుకు సీఎం కుట్ర'
author img

By

Published : Feb 15, 2021, 11:02 AM IST

Updated : Oct 10, 2022, 3:33 PM IST

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, అతని కుమారుడు బీవై విజయేంద్రపై భాజపా రెబల్​ రెబల్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్​ తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి, కొడుకులు కలిసి వీరశైవ-లింగాయత్ సంఘాన్ని విడదీసేందుకు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. తుముకూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పదవికి ముప్పు వచ్చినప్పుడే ముఖ్యమంత్రికి వీరశైవ-లింగాయత్ ప్రజలు గుర్తొస్తారని ఆరోపించారు. స్వయంగా లింగాయత్ అయిన యడియూరప్పకు... లింగాయత్​ కమ్యూనిటీకి ఓబీసీ(2ఏ) గుర్తింపు రాకూడదనే దురుద్దేశం ఉందని విమర్శించారు.

రాష్ట్రంలోని వీరశైవ-లింగాయత్ కమ్యూనిటీకి ఓబీసీ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ బసవ జయ మృత్యుంజయ స్వామి( కుదలసంఘమ మఠం) చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. యడియూరప్ప త్వరలో పదవి నుంచి దిగిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో సీనియర్​ నాయకుడైన తనకు చోటు కల్పించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : ట్రక్కు బోల్తా.. 16 మంది కూలీలు మృతి

Last Updated : Oct 10, 2022, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.