ETV Bharat / bharat

34 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై రాడ్​తో.. - మహారాష్ట్రలో అత్యాచారం

2012లో దేశవ్యాప్తంగా సంచలనమైన నిర్భయ అత్యాచార ఘటన తరహాలోనే ఇప్పుడు మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. 34ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఆ తర్వాత ఆమె జననాంగంలో ఇనుప రాడ్ దూర్చి.. చిత్రహింసలకు గురిచేశాడు.

Woman raped
అత్యాచారం చేసి
author img

By

Published : Sep 10, 2021, 8:46 PM IST

మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ దారుణం వింటే 2012లో జరిగిన నిర్భయ ఘటనను గుర్తుకుతెస్తుంది. ముంబయిలోని సకినాక సబ్​ అర్బన్​ ప్రాంతంలో 34 ఏళ్ల ఓ మహిళపై తన వాహనంలో అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్​ చౌహాన్ అనే కిరాతకుడు. అంతటితో ఆగక.. మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్​ను దూర్చి చిత్రహింసలకు గురిచేశాడు.

ఏం జరిగిందంటే..?

శుక్రవారం ఉదయం ఖైరానీ రోడ్డు సమీపంలో ఓ మహిళ రక్తపు మడుగులో పడిఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహిళపై అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ అధికారి తెలిపారు.

అంతేకాక బాధితురాలి ప్రైవేట్​ భాగాల్లో ఇనుప రాడ్ దూర్చి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపారు. రోడ్డుపక్కన నిలిపిఉన్న వాహనంలోనే నిందితుడు.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.

ఇదీ చదవండి: మళ్లీ బతికొస్తాడని గంటలపాటు బురదలోనే మృతదేహం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.