ETV Bharat / bharat

మహిళ జననాంగాల్లో పైపు చొప్పించి రేప్.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం - ఐదేళ్ల బాలికపై రేప్​ మథుర

ఓ మహిళను అత్యాచారం చేశారు కొందరు దుండగులు. అనంతరం ఆమె జననాంగాల్లోకి పైపును చొప్పించారు. ఆ తర్వాత చంపేశారు. ఇక అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరోవైపు ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడో దుండగుడు.

Faridad Rape And Murder Case
Faridad Rape And Murder Case
author img

By

Published : Nov 10, 2022, 11:38 AM IST

Updated : Nov 10, 2022, 1:22 PM IST

హరియాణాలో దారుణం జరిగింది. ఓ మహిళను కొందరు హత్యాచారం చేశారు. అనంతరం మృతదేహాన్ని పార్క్​లో​ పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఫరీదాబాద్​లో జరిగింది.
పోలీసులు వివరాల ప్రకారం.. ఫరీదాబాద్​ సెక్టార్​ 7లోని పార్క్​లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. హత్యాచారం చేసి సగం దుస్తులతో ఉన్న మహిళ మృతదేహాన్ని కొందరు పార్క్​లో పడేశారు. ఆమె జననాంగాల్లో పైప్​ చొప్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు. చనిపోయిన మహిళ వయసు 32 ఏళ్లు ఉంటుందని చెప్పారు. అమె తలకు స్వల్ప గాయాలున్నట్లు తెలిపారు. తల నుంచి కారిన రక్తం.. పూర్తిగా ఎండిపోయి ఉందని చెప్పారు. 2-3 రోజుల క్రితం మహిళ మృతిచెంది ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే మృతురాలు ఎవరో ఇంతవరకు పోలీసులు గుర్తించలేదు.

పార్క్​లో శవం ఉందని గురువారం ఉదయం 8 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్​ బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బాద్​షా ఖాన్​ ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. హత్యాచారం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శవ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. మృతురాలిని గుర్తించిన తర్వాత నిందితులును త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.

అప్పులు తీసిన ప్రాణాలు..
అప్పులు ప్రాణాల మీదకు తెచ్చాయి. అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటుంబంలోని ఐదుగురు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

పోలీసులు వివరాల ప్రకారం.. నవాడ జిల్లాలోని నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన పండ్ల వ్యాపారి కేదార్‌లాల్‌ గుప్తా 12 లక్షలు అప్పు చేశాడు. వడ్డీలు అధికమై.. వేధింపులు తట్టుకోలేక బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విషం తాగాడు. అనంతరం ఆ ఐదుగురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఓ గుడి వద్ద పడి ఉన్న వాళ్లను ఓ స్థానికుడు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని.. వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులను కేదార్ లాల్​ గుప్తా, అతడి భార్య అనితాదేవితో పాటు గుడియా కుమార్, ప్రిన్స్​ కుమార్, శబ్నం కుమారిగా పోలీసులు గుర్తించారు. కేదార్​ మరో కుమార్తె సాక్షి కుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సూసైడ్ నోట్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు సాక్షి కుమారి ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై జిల్లా ఏస్పీ గౌరవ్ మంగ్లా స్పందించారు. " ఈ కుటుంబం అత్మహత్య చేసుకోడానికి అప్పులే కారణమై ఉంటుంది. మృతులంతా ఏదో విష పదార్థం తిన్నారు. మృతదేహాలను శవపరీక్షల కోసం పంపించాం. నివేదికలు వస్తే అత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయి. ఆ తర్వాత అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తారు" అని పేర్కొన్నారు.

ఐదేళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్లి రేప్..
ఉత్తర్​ప్రదేశ్​లో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. మథురలోని ఓ ఐదేళ్ల చిన్నారి దుకాణానికి వెళ్లింది. అది గమనించిన ఓ 20 ఏళ్ల యువకుడు చిన్నారిని వెంబడించి.. తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తన కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో గ్రామాస్థులతో కలిసి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిముందు నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడి కోసం గాలిస్తున్నారు.

మంత్రాల నెపంతో మర్డర్..
నింగిలోకి రాకెట్లు దూసుకెళ్తున్నా.. మూఢ నమ్మకాలను మాత్రం కొంతమంది ప్రజలు వీడటం లేదు. దీన్ని నిజం చేసేలా బిహార్​లోని గయాలో ఓ దారుణం జరిగింది. మంత్రాల నెపంతో ఓ మహిళను కిరాతకంగా సజీవ దహనం చేశారు. ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడికి తెగబడ్డారు. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో 68 మంది నిందితులను గుర్తించారు. అందులో ఇప్పటికే 14 మందిని అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించి.. ఆర్థికంగా సహాయం చేశామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి : పొట్లకాయ రసం తాగి వ్యక్తి మృతి.. భార్యపై అనుమానంతో దారుణం.. జననాంగాల్లో రాడ్​ దూర్చి..

వేరే కులం వ్యక్తితో ప్రేమ.. మైనర్​ కూతురిని కాలువలో తోసేసి చంపిన తండ్రి

Last Updated : Nov 10, 2022, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.