ETV Bharat / bharat

భాజపా నేత బంగ్లా వెనక మహిళ మృతదేహం.. 'ప్లే బాయ్' అని స్లిప్​పై రాసి.. - కాంతా నలావడే బంగ్లా సమీపంలో మహిళ హత్య

భాజపా మాజీ ఎమ్మెల్సీ బంగ్లా సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పాతిపెట్టడం కలకలం రేపింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు, అసభ్య పదాలతో 'ప్లే బాయ్' అని స్లిప్ మీద రాసి.. అందరి ఇళ్ల ముందు పడేశాడు ఓ యువకుడు. ఆ స్లిప్ మీద తన ఫోన్ నంబర్​ను సైతం రాశాడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో వెలుగుచూసింది.

woman dead body found in bungalow
బంగ్లా ఆవరణలో గుర్తు తెలియని మహిళ మృతదేహం
author img

By

Published : Dec 31, 2022, 8:46 PM IST

మహారాష్ట్ర.. సతారా జిల్లాలో ఓ బంగ్లా వెనుక మహిళ మృతదేహాన్ని పాతిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ బంగ్లా.. భాజపా మాజీ ఎమ్మెల్సీ కాంతా నలావడేది అని పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే ఘటనాస్థలికి స్థానికులు భారీగా చేరుకున్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. హత్యానంతరం సాక్ష్యాలను కనుమరుగు చేసేందుకు నిందితులు మహిళ మృతదేహాన్ని పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

'మాజీ ఎమ్మెల్సీ కాంతా నలవాడే బంగ్లా వెనుక భాగంలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టిలో మహిళ మృతదేహాన్ని పాతిపెట్టారు. కాంతా నలవాడే కుటుంబ సభ్యులు బంగ్లా పరిసరాలను శుభ్రం చేస్తుండగా వారికి మృతదేహం కనిపించింది. వారే మాకు సమాచారం అందించారు. ఇక్కడికి వచ్చి మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. మృతురాలి వివరాలు ఇంకా తెలియలేదు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం.'
-పోలీసులు

స్లిప్​పై అసభ్యపదజాలంతో రాసి..
ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో ఓ యువకుడు చేసిన పని స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. చిన్న స్లిప్​ మీద అసభ్య పదాలతో 'ప్లే బాయ్​' అని రాసి పలువురి ఇంటి ప్రాంగణంలో పడేశాడు యువకుడు. అదే స్లిప్​పై తన ఫోన్ నంబర్​ను సైతం రాశాడు. ఆ స్లిప్‌ని చూసిన కొందరు ఎవరో ఆకతాయి చేసిన పనిగా భావించారు. అయితే సెక్టార్-3 కాలనీలోని చాలా ఇళ్ల సమీపంలో ఇలాంటి స్లిప్​లు పడి ఉన్నాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. అదే కాలనీకి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి స్వస్థలం రాజ్​నంద్​గావ్ అని.. రాయ్​పుర్​కు చదువు నిమిత్తం వచ్చాడని పోలీసులు తెలిపారు.

woman dead body buried
యువకుడు రాసిన స్లిప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.