wife wrist cuts husband: భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడం వల్ల తనను విడిచిపెట్టి వెళ్లిపోతుందని భయపడ్డాడు ఓ భర్త. ఆమెతో తగాదాలకు పాల్పడ్డాడు. ఉద్యోగం మానేయమన్నాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడం వల్ల.. భార్య చేయిని నరికేశాడు ఓ కిరాతకుడు. బాధితురాలు రేణు ఖాతున్ను దుర్గాపుర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బంగాల్లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా కోజల్సా గ్రామంలో జరిగింది. నిందితుడితో సహా అతడి కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది.
అసలేం జరిగిందంటే: షేర్ మహమ్మద్, రేణు ఖాతున్ భార్యాభర్తలు. రేణు.. దుర్గాపుర్‌లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో నర్సింగ్ శిక్షణ తీసుకుండేది. ఈ మధ్యే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాసై ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆమె ఉద్యోగం చేయడానికి నిందితుడు షేర్ మహమ్మద్ అంగీకరించలేదు. దీంతో ఇరువురి దంపతుల మధ్య వివాదాలు వచ్చాయి. ఆ సమయంలోనే భార్యపై కోపంతో పదునైన ఆయుధంతో ఆమె కుడి చేయిని నరికేశాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న రేణుని ఆసుపత్రిగా తరలించగా వైద్యులు ఆమె చేయిని తొలగించి వైద్యం చేశారు.
"రేణు ఖాతున్, షేర్ మహమ్మద్‌లకు చదువుకునేటప్పటి నుంచే పరిచయం ఉంది. దీంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాక.. వీరి పెళ్లి చేశాం. రూ. లక్ష నగదు, బంగారు ఆభరణాలు, సామాన్లు కట్నం కింద ఇచ్చాం. అయితే షేర్ మహమ్మద్.. రేణు ఉద్యోగం చేయడానికి ఒప్పుకోలేదు. అందుకే షేక్.. రేణు చేతిని నరికేశాడు."
-రిపోన్ షేక్,బాధితురాలు రేణు ఖాతున్ తాత
ఇవీ చదవండి: ఆన్లైన్ రమ్మీకి బానిసై.. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య