Why Water Leaks From Car Exhaust Pipe : ఎన్ని లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కారులో అయినా.. చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే.. సమస్య చిన్నదే కదా అని యథావిధిగా వాహనాన్ని నడుపుతుంటారు కొందరు. దీంతో.. కొన్నిసార్లు ఏకంగా ఇంజిన్ దెబ్బతినే వరకూ పరిస్థితి వెళ్తుంది. ఇలాంటి సమస్యల్లో.. కారు కింద ఎగ్జాస్ట్ పైపు నుంచి నీరు లీక్ కావడం ఒకటి! మరి.. ఈ లీకేజీతో ఎలాంటి ప్రమాదం ఉంది? ఇంజిన్ ఏమైనా దెబ్బతింటుందా? నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నీరు ఎందుకు కారుతుంది..?
అసలు కారు ఎగ్సాస్ట్ పైపు నుంచి నీరు ఎందుకు కారుతుందంటే.. కారులో ప్రయాణిస్తున్నప్పుడు వాతావరణం వేడిగా ఉంటే అందరూ ఏసీని ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఎగ్సాస్ట్ పైపు నుంచి వాటర్ లీక్ అవుతుంది. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లోపలికి వచ్చే గాలిని చల్లబరచడంతోపాటు తేమను తగ్గిస్తుంది. దీంతో.. నీరు మంచులా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన నీరు కారులో ఏదో ఒక మూల నుంచి బయటకు వెళ్లాలి. కాబట్టి, ఆ నీరు ఎగ్జాస్ట్ పైపు ద్వారా బయటకు వెళ్తుంది.
అలాగైతే ప్రమాదమే..
సాధారణంగా చిన్న చిన్న నీటి చుక్కలు.. ఎగ్జాస్ట్ పైపు నుంచి కారడం వల్ల ఇంజిన్‌కు పెద్దగా ప్రమాదమేమి ఉండదని నిపుణులు అంటున్నారు. కానీ.. ఆ నీరు రంగు మారినా లేదా ఘాటైన వాసన వచ్చినా.. వెంటనే కారును మెకానిక్ వద్దకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఎగ్జాస్ట్ పైపు నుంచి నీరు ఎక్కువగా లీకైతే.. ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంజిన్ బ్లాక్ లేదా సిలిండర్‌లో పగుళ్ల వల్ల కూడా ఎగ్జాస్ట్ పైపు నుంచి నీరు లీక్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
రూ15 లక్షల బడ్జెట్లో రానున్న బెస్ట్ ఈవీ కార్స్ ఇవే!
వాతావరణం వేడిగా ఉండడం వల్ల కారు వెంటిలేషన్ ఓపెనింగ్స్ నుంచి తెల్లటి పొగ వెలువడుతుందని RAC (Refrigeration and Air Conditioning Mechanic) నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ పొగ ఘాటైన లేదా దుర్వాసనతో ఉంటే మాత్రం ఇంజిన్ ప్రమాదంలో ఉన్నట్టుగా భావించాలని.. లేకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు. పొగ ముదురు రంగులో ఉండి.. ఘాటైన వాసన వస్తే మాత్రం వెంటనే కారును ఆపి.. వెళ్లి మెకానిక్‌ను తీసుకురావాలని సూచిస్తున్నారు. ఎయిర్ కండీషనర్ సిస్టమ్‌ను తక్కువ సేపు రన్ చేయడం వల్ల ఈ పొగను ఆపవచ్చని చెబుతున్నారు. సో.. ఇకమీదట కారు నడుపుతున్నప్పుడు ఈ విషయాన్ని గమనిస్తూ ఉండండి. ఎగ్సాస్ట్ పైపు నుంచి నీరు చుక్కలుగా కారినా.. వాసన లేకున్నా.. రంగు మారకున్నా సమస్య లేదన్నమాట. నీరు ఎక్కువగా కారినా.. రంగు మారి ఘాటైన వాసన వచ్చినా సమస్య ఉందని గుర్తించాలి. మెకానిక్‌ను సంప్రదించాలి.
రూ.10 లక్షల బడ్జెట్లో - బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న టాప్-5 కార్స్ ఇవే!
స్టన్నింగ్ ఫీచర్స్‌తో నవంబర్‌లో విడుదల కానున్న సూపర్ కార్స్ & బైక్స్ ఇవే!