సైబర్ మోసగాళ్ల వలలో పడి రూ.25లక్షలు పోగొట్టుకున్నాడు ఒడిశాకు చెందిన ఓ ఇంజినీర్. సమాజానికి భయపడి తొలుత మౌనంగా ఉండిపోయిన అతడు.. తనకు న్యాయం చేయాలంటూ ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.
వాట్సాప్‌తో మాయాజాలం:
బాధితుడు.. భువనేశ్వర్‌లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. ఈ సందేశం ఎవరు పంపారా అని ఆలోచిస్తుండగానే వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేసి చూస్తే.. అవతలి వైపున ఓ మహిళ నగ్నంగా ఉంది. ఏవేవో కబుర్లు చెబుతోంది. వెంటనే కాల్ కట్ చేశాడు ఆ ఇంజినీర్.
అప్పటికే రికార్డ్ అయిన వాట్సాప్ వీడియో కాల్‌ను దోపిడీకి అస్త్రంగా మలుచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. నగ్నంగా ఉన్న మహిళతో ఇంజినీర్ మాట్లాడుతున్న వీడియోను మార్ఫ్ చేశారు. రూ.25లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. సమాజంలో తన ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భయపడిన ఇంజినీర్.. వారు అడిగిన డబ్బు సమర్పించుకున్నాడు.
ఈ మొత్తం వ్యవహారంపై భువనేశ్వర్‌లోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వాట్సాప్ న్యూడ్ కాల్స్‌తో సైబర్ మోసగాళ్లు లక్షల రూపాయలు గుంజుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. ఇటీవల హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ఉంటున్న ఒక వైద్యుడికి నేరుగా వాట్సాప్ కాల్ వచ్చింది. ఒక యువతి మాట్లాడింది. రెండ్రోజులు అలా సాగాక.. దుస్తులన్నీ తీసేసి మాట్లాడమంది. ఎవరూ లేరుకదా అని అతను నగ్నంగా మారి సంభాషించాడు. చివరకు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.