ETV Bharat / bharat

ప్రాచీన భాషకు ప్రాణం పోస్తున్న అసోం పల్లె వాసులు! సంస్కృతంలోనే మాట్లాడుతున్న గ్రామస్థులు - sanskrit speaking village

ప్రస్తుతం సంస్కృతం అంతరించిపోయే భాషల జాబితాలో ఉంది. ఈ భాషను తరవాత తరం వారికి అందించేందుకు.. అసోంలోని ఓ గ్రామంలోని ప్రజలు తమ వంతుగా కృషి చేస్తున్నారు.

Villagers of Assam
అసోంలోని పటియాలా గ్రామస్థులు
author img

By

Published : Oct 22, 2022, 9:26 PM IST

Updated : Oct 22, 2022, 9:43 PM IST

సంస్కృత భాష, భారతదేశానికి చెందిన అతి పురాతనమైన భాష. ప్రస్తుతం ఇది అంతరించిపోయే దశలో ఉంది. ప్రాచీన కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ భాష పూర్తిగా మరుగున పడిపోయింది. ఇలాంటి తరుణంలోనే అసోంలోని ఓ గ్రామ ప్రజలు సంస్కృతానికి ఊపిరి పోస్తున్నారు. కరీంగంజ్ జిల్లా, రాతబరి నియోజకవర్గం పటియాల గ్రామస్థులందరూ సంస్కృత భాషను మాట్లాడుతున్నారు. దీంతో ఆ ఊరు సంస్కృత గ్రామంగా మారిపోయింది.

2015 నుంచి చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సంస్కృత భాషను మాట్లాడుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో మొత్తం 60 కుంటుంబాలు ఉండగా.. సుమారు 300 మంది నివసిస్తున్నారు. వారంతా దేశ పురాతన భాషను మాట్లాడుతూ దానికి పునరుజ్జీవం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ భాష అంతరించిపోయే దశలో ఉందని, దాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు. అందుకే ఈ భాషను ఊరంతా మాట్లాడుతూ, భవిష్యత్తు తరాలు సైతం మాట్లాడేలా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.

"2015లో సంస్కృత భారతి కార్యకర్తలు గ్రామంలో సంస్కృత శిబిరాన్ని ఏర్పాటుచేసి.. సంస్కృతం గొప్పతనాన్ని వివరించారు. అప్పటి నుంచి అందరూ సంస్కృతాన్ని నేర్చుకొంటున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సంస్కృత భాష మాట్లాడుతున్నారు."

-దీప్​నాథ్, యోగా గురువు

గ్రామంలో రోజూ ఉదయం 5 నుంచి 7 గంటల వరకు యోగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని యోగా గురువు దీప్​నాథ్ తెలిపారు. 2013లో ఈ యోగా శిబిరాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతినెలా గ్రామంలో గాయత్రి యాగాన్ని నిర్వహిస్తామని.. గ్రామస్థులందరూ ఈ పూజలో పాల్గొంటారని దీప్​నాథ్ పేర్కొన్నారు. గ్రామంలో చాలా వరకు వ్యవసాయంపైనే ఆధారపడ్డారని.. 15 మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నట్లు వివరించారు. తమ పక్క గ్రామం అనిపుర్ వాసులు సైతం సంస్కృతాన్ని నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.

Last Updated : Oct 22, 2022, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.