ETV Bharat / bharat

Vaccination in india: 50శాతానికిపైగా వయోజనులకు వ్యాక్సినేషన్‌ పూర్తి! - దేశంలో వ్యాక్సినేషన్​

Vaccination in india: ఆదివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 127.66కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వయోజనుల జనాభాలో 50శాతం మందికిపైగా రెండు డోసుల టీకాలు తీసుకున్నారని చెప్పింది. శనివారం ఒక్క రోజే కోటి డోసులు ఇచ్చామని ప్రకటించింది.

Vaccination in india
దేశంలో వ్యాక్సినేషన్​
author img

By

Published : Dec 5, 2021, 3:09 PM IST

Vaccination in india: కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నాటికి మొత్తం 127.66కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం ఒక్క రోజే కోటి డోసులు ఇచ్చామని ప్రకటించింది. ఒక్క రోజులో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేయడం ఇది ఆరోసారి అని పేర్కొంది.

Vaccination records india: ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు 47.59కోట్ల మంది రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు. దేశ వయోజనుల జనాభాలో 50శాతం మందికిపైగా రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.

"అర్హత గల వారిలో 50శాతానికిపైగా వయోజనులు రెండు డోసులు తీసుకోవడం గొప్ప విషయం. మరో మైలురాయిని చేరుకున్నందుకు భారతదేశానికి అభినందనలు. కరోనా మహమ్మారిపై పోరులో మనమంతా కలిసే విజయం సాధిస్తాం"

-మన్​సుఖ్ మాండవీయా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట్లో కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సినేషన్‌ చేపట్టారు. ఆ తర్వాత క్రమంగా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయడం మొదలైంది. అక్టోబర్‌ నెలలో భారత్‌.. 100కోట్ల వ్యాక్సినేషన్‌ మైలు రాయిని చేరుకుంది. భారతీయులందరికీ వ్యాక్సిన్‌ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఇదీ చూడండి: టీకా తీసుకుంటే రూ.50 వేల స్మార్ట్​ఫోన్ ఫ్రీ- ఆఫర్​ వారమే!

కచ్చితంగా టీకా తీసుకోవాల్సిందే..

వందశాతం మందికి కొవిడ్​ వ్యాక్సిన్ పంపిణీ చేయడమే లక్ష్యంగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రజలంతా టీకా తీసుకోవడం తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్​ తీసుకోని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసులు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు.. దేశంలో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 2,796 మంది మరణించారు. 8,190 మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి: Omicron Delhi: భారత్​లో ఐదో ఒమిక్రాన్​ కేసు- దిల్లీలో ఒకరికి నిర్ధరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.