ETV Bharat / bharat

ప్రియుడితో భార్య.. ఇద్దరినీ కొట్టిచంపిన భర్త.. కొడుకులూ సపోర్ట్! - యూపీ క్రైమ్

Husband killed wife: మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న భార్యను.. కర్రలతో కొట్టి హత్య చేశాడు ఓ వ్యక్తి. భార్య ప్రియుడిని సైతం చంపేశాడు. ఈ హత్యల్లో అతడికి కుమారులు సహకరించారు.

UP MURDER
UP MURDER
author img

By

Published : Jun 9, 2022, 8:10 AM IST

Husband killed wife: ఉత్తర్​ప్రదేశ్ షాజహాన్​పుర్​లో ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిని హత్య చేశాడు. ఇందుకు అతడి కుమారులు సైతం సహకారం అందించారు. జలాలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓంపాల్ కుష్వాహా.. తన భార్య మమతతో (40) కలిసి దహార్​పుర్​ గ్రామంలో నివసిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు.

UP crime Husband killed wife: అయితే, గత రెండేళ్లుగా మమత.. రమన్ పాల్(42) అనే వ్యక్తితో అదే గ్రామంలో సహజీవనం చేస్తోంది. ఈ విషయంపైనే ఓంపాల్ కుష్వాహా, అతడి కుమారులు.. మమతపై కోపంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరినీ కర్రలతో కొట్టి చంపారు.
నిందితులు పారిపోయారని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ జైశంకర్ తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించనున్నారు. గ్రామంలో పోలీసులను మోహరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.