ETV Bharat / bharat

చెట్టు విషయంలో గొడవ.. అన్నను నరికిచంపిన తమ్ముడు - హత్య

Murder: చెట్టును తొలగించే విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం చెలరేగింది. దీంతో అన్నను కత్తితో దాడి చేసి హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

UP Man kills elder brother
అన్నను నరికిచంపిన తమ్ముడు
author img

By

Published : May 2, 2022, 6:48 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన జరిగింది. ఇంటి సమీపంలోని చెట్టును తొలగించటంపై అన్నదమ్ముల మధ్య చెలరేగింది. దీంతో ఆగ్రహానికి గురైన తమ్ముడు.. కత్తితో అన్ననే హతమార్చాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది..: "బారాబంకీలోని హుస్సేన్​పుర్​ గ్రామంలో ఈ దారుణం జరిగింది. తన ఇంటికి సమీపంలోని ఓ చెట్టును తొలగించే క్రమంలో తన తమ్ముడు రాజేంద్రను అడ్డుకున్నాడు నైమిలాల్​. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే నైమిలాల్​పై కత్తితో దాడి చేశాడు రాజేంద్ర." అని పోలీసులు తెలిపారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా, అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో రాజేంద్రను అరెస్టు చేశారు పోలీసులు.

సోదరుని పెళ్లికి వెళ్లేందుకు డబ్బివ్వలేదని..: యూపీలోనే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. భర్తపై కోపంతో ఇద్దరు చిన్నారులతో పాటు కదులుతున్న రైలు ముందు దూకేసింది ఓ మహిళ. మోతీగంజ్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని గోండా-గోరఖ్​పుర్​ మార్గంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తన సోదరుడి వివాహానికి వెళ్లేందుకు భర్త రాకపోవడం సహా డబ్బులు ఇవ్వకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఆమెను తన పుట్టింటికీ వెళ్లనిచ్చేవారు కాదని సమాచారం.

బోరుబావిలో పడి..: తన ఏడో పుట్టినరోజుకు ఒకరోజు ముందే బోరుబావిలో పడి చిన్నారి చనిపోయింది. ఈ విషాద ఘటన యూపీలోని బరేలీలో ఆదివారం చోటుచేసుకుంది. ఆ చిన్నారి తల్లి ఓ పోలీస్​ కానిస్టేబుల్​. చిన్నారి కోసం వెతుకుతున్న క్రమంలో 15 అడుగుల బోరుబావిలో కనపడింది. సోమవారం ఆ పాపకు ఏడేళ్లు వస్తాయని స్థానికులు చెప్పారు.

ఇదీ చూడండి: షవర్మా తిని విద్యార్థిని మృతి.. ఆస్పత్రిలో మరో 18 మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.