పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్నది మహిళను కాదని తెలిసింది. దీంతో.. మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యక్తి.
ఇదీ జరిగింది...
ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్కు చెందిన ఓ వ్యక్తికి పంకి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో ఏప్రిల్ 28న వివాహం జరిగింది. అయితే.. పెళ్లై చాలా రోజులైనప్పటికీ ఇరువురి మధ్య దాంపత్య జీవితం సాఫీగా సాగడం లేదు. అనారోగ్య సమస్యలున్నాయని చెప్పి భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు అయిష్టత చూపింది ఆ మహిళ. కొన్ని రోజుల తర్వాత.. భార్య ప్రవర్తనపై ఆ వ్యక్తికి అనుమానం కలిగింది.
వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. వైద్యులు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆమె మహిళ కాదని.. ట్రాన్స్జెండర్ అని తెలిసింది. అంతే.. మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యక్తి. మెడికల్ రిపోర్టు చూపించి.. తన వివాహానికి కారణమైనవారిపై కేసు నమోదు చేశాడు.
సెక్షన్ 420 కింద 8 మందిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:పోలీస్ కానిస్టేబుళ్లుగా 15 మంది ట్రాన్స్జెండర్లు