ETV Bharat / bharat

యూపీలో ఒంటరైన ఒవైసీ.. యోగి పరోక్ష మద్దతు! - ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఎంఐఎం

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో కలిసి భాజపాకు చెక్ పెట్టాలని భావించిన మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి (Owaisi news) ఎదురుదెబ్బ తగిలిందా? పొత్తుకు బీఎస్పీ నిరాకరించడం, రాజ్​భర్​తో కూటమి కంచికి చేరడం వల్ల.. ఒంటరిగానే బరిలోకి దిగనున్నారా? ఆయనకు యోగి ఆదిత్యనాథ్ వెనకనుంచి మద్దతు ఇస్తున్నారా? అసలు ఒవైసీ ప్లాన్ ఏంటి? ఓసారి చూద్దాం.

UP Assembly Polls Owaisi
యూపీలో ఒంటరైన ఒవైసీ.. యోగి పరోక్ష మద్దతు!
author img

By

Published : Nov 8, 2021, 6:06 PM IST

ముస్లిం ఓటర్లను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా మజ్లిస్ పార్టీని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ (Owaisi news).. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల్లో తనదైన ముద్రవేయాలని తహతహలాడుతున్నారు. రాష్ట్రంలోని ముస్లింలకు రాజకీయ ప్రత్యామ్నాయంగా మారాలని భావిస్తున్నారు. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న పూర్వాంచల్, పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈ వర్గం జనాభా 20 శాతం వరకు ఉన్న నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో (MIM in UP election) ఇతర పార్టీలకు షాక్ ఇవ్వాలని ఒవైసీ భావిస్తున్నారు.

UP Assembly Polls Owaisi
అసదుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ అధినేత

అయితే, ప్రస్తుత ఎన్నికల్లో ఒవైసీ అడుగులు అనుకున్నట్లుగా పడటం లేదు. యూపీలోని ఇతర పార్టీలతో జట్టుకట్టి పోటీ (MIM in UP election) చేయాలని తొలుత భావించినప్పటికీ.. అవేవీ కుదరలేదు. తొలుత పెద్ద పార్టీలపైనే దృష్టిసారించి చిన్న పార్టీలను దూరం చేసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో కూటమి (Owaisi alliance in UP) ఏర్పాటు చేయాలని భావించారు ఒవైసీ. కానీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూటమి అంశాన్ని బహిరంగంగానే కొట్టిపారేశారు. ఆ తర్వాత ఓంప్రకాశ్ రాజ్​భర్​తో కలిసి 'భాగీదారీ సంకల్ప్ మోర్చా' పేరుతో కూటమి (Owaisi alliance in UP) ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే, చివరి క్షణంలో సమాజ్​వాదీ పార్టీతో చేతులు కలిపిన రాజ్​భర్.. ఒవైసీకి (MIM in UP election) హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఏకాకిగా మిగిలిపోయారు ఒవైసీ. అయితే, ఒవైసీతో కూటమిని సమాజ్​వాదీ పార్టీ వ్యతిరేకించలేదు. మజ్లిస్​తో పొత్తుపై (Owaisi alliance in UP) ఎస్పీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో సమాజ్​వాదీ కూటమిలో చేరే అవకాశం మజ్లిస్​కు (MIM in UP election)ఇంకా మిగిలే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒంటరిగా ముందుకు!

ఈ పరిస్థితుల్లో ఒంటరిగానైనా వంద సీట్లలో పోటీ చేయాలని ఒవైసీ ప్రణాళికలు రచిస్తున్నారు. దళితులు, ముస్లింల ఓట్లనే లక్ష్యంగా చేసుకొని ఎన్నికల బరిలో (MIM in UP election) దిగుతున్నారు. యూపీ జనాభాలో 40 శాతానికి పైగా వాటా ఈ రెండు సామాజిక వర్గాలదే. వీరంతా సమాజ్​వాదీ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్నారు. మజ్లిస్ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువగా నష్టపోయేది అఖిలేశ్ పార్టీనే. ముస్లిం, దళితుల ఓట్లను ఎంఐఎం (MIM in UP election) చీల్చగలిగితే.. ఎస్పీకి అపార నష్టం జరుగుతుంది. అదే సమయంలో ఇది భాజపాకు కలిసొస్తుంది.

2017లోనూ యూపీ ఎన్నికల్లో పోటీ (MIM in UP election 2017) చేసింది మజ్లిస్ పార్టీ. 38 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుతం 100 సీట్లపై కన్నేసిన నేపథ్యంలో సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది మజ్లిస్. 'శోషిత్ వంచిత్ సమాజ్ సమ్మేళన్'.. పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒవైసీ సైతం త్వరలో యూపీలో పర్యటించనున్నారు. నవంబర్ 11 నుంచి 28 మధ్య జరగనున్న సభల్లో ప్రసంగించనున్నారు. మొరాదాబాద్, మేరఠ్, అలీగఢ్, బారాబంకి, జౌన్​పుర్, బలరాంపుర్ నియోజకవర్గాల్లో ఈ సభలు జరగనున్నాయి.

యోగి పొగడ్తలు!

మరోవైపు, ఒవైసీకి ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెరవెనుక నుంచి మద్దతిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళితులు, ముస్లింల ఓట్లను ఎంఐఎం చీల్చగలిగితే.. అది భాజపాకు కలిసొస్తుందని యోగి భావిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్పీని దెబ్బతీసేందుకే ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని సమాచారం. అందుకే ఒవైసీని 'గొప్ప రాజకీయ నేత' అంటూ కొనియాడారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.