ఉత్తర్‌ప్రదేశ్ బండా జిల్లాలోని కైలాశపురిలో దారుణం జరిగింది. ఓ యువతి, ఇద్దరు మహిళలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు 60 ఏళ్ల వృద్ధుడు. గల్లీ క్రికెట్లో పిల్లలు గొడవపడడం చూసి కోపం తెచ్చుకున్న నిందితుడు.. అక్కడే కూర్చుని మ్యాచ్ చూస్తున్న వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు సర్కిల్ అధికారి రాకేశ్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ జరిగింది..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండాలో అశుతోశ్ త్రిపాఠి అలియాస్ గుల్లి అనే వృద్ధుడు ఇద్దరు మహిళలు, ఓ యువతిపై యాసిడ్ దాడికి దిగారు. ఈ దాడిలో బాధితులకు తీవ్రగాయాయ్యాయి. వీరిని రాణీ సింగ్, లక్ష్మీ సింగ్, శోభాసింగ్గా పోలీసులు గుర్తించారు. త్రిపాఠి ఇంటి బయట వీధిలో పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. అనుకోకుండా వారు గొడవ పెట్టుకున్నారు. గొడవ అంతకంతకూ పెరగడంతో కోపం తెచ్చుకున్న త్రిపాఠి అక్కడే కూర్చుని మ్యాచ్ చూస్తున్న వారిపై యాసిడ్ దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ మ్యాచ్‌లో నిందితుడు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇదీ చూడండి: వింత ఆచారం.. ఆవులతో తొక్కించుకున్న యువకులు