ETV Bharat / bharat

'100 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా!'.. నితిన్​ గడ్కరీ ఆఫీస్​కు బెదిరింపు కాల్స్ - మహారాష్ట్ర నాగ్​పుర్​ కేంద్ర మంత్రి కార్యాలయం

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడుని అని చెప్పుకునే ఓ అగంతకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి మూడు సార్లు బెదిరింపు కాల్స్ చేశాడు. రూ. 100 కోట్లు ఇవ్వకపోతే గడ్కరీపై బాంబ్​తో దాడి చేసి చంపేస్తాని నిందితుడు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

union minister nitin gadkari
union minister nitin gadkari
author img

By

Published : Jan 14, 2023, 2:45 PM IST

Updated : Jan 14, 2023, 10:54 PM IST

మహారాష్ట్రలోని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ కార్యాలయానికి మూడు బెదిరింపు కాల్స్​ వచ్చాయి. శనివారం ఉదయం మహారాష్ట్ర నాగ్​పుర్​లోని ఆయన కార్యాలయానికి 11:25 నుంచి 12:30 గంటల మధ్య దావూద్ ఇబ్రహీం గ్యాంగ్​కు చెందిన వాడినంటూ ఓ వ్యక్తి మూడు సార్లు కాల్స్​ చేసి రూ. 100 కోట్లు డిమాండ్ చేశాడు. సమాచారం అందుకొన్న నాగ్​పుర్ పోలీసులు హుటాహుటిన ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఆ కాల్స్​పై పూర్తి విచారణ చేపట్టిన పోలీసులు కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి ఈ కాల్స్​ చేసినట్లు గుర్తించారు. వెంటనే క్రైమ్ బ్రాంచ్​ బృందాన్ని కర్ణాటకకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

"కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి తాను దావూద్​ ఇబ్రహీం గ్యాంగ్ మెంబర్​ను అని చెప్పి గడ్కరీ కార్యాలయానికి మూడు సార్లు కాల్​ చేశాడు. గడ్కరీ నుంచి రూ. 100 కోట్లు డిమాండ్​ చేశాడు. తన డిమాండ్​ నెరవేర్చకుంటే.. మంత్రిపై బాంబు దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. తన అడ్రస్​కు డబ్బు పంపించమని కోరాడు. తన ఫోన్​ నంబర్​, చిరునామా చెప్పాడు. ఆ నిందితుడికి గతంలో నేర చరిత్ర కూడా ఉంది. నిందితుడు చెప్పిన అడ్రస్​కు క్రైమ్​ బ్రాంచ్​ బృందాన్ని పంపించాము" అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ప్రస్తుతం నాగ్‌పుర్‌లో ఉన్నారు. అక్కడ ఆయన మకర సంక్రాతి వేడుకలు జరుపుకోనున్నారు. దీంతో ఆయన వేడుక జరుపుకునే ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు నాగ్​పుర్​ డీసీపీ తెలిపారు.
గడ్కరీ నొయిడాలో శుక్రవారం ఉదయం ఆటో ఎక్స్​పో 2023 ఎగ్జిబిషన్​ను ప్రారంభించారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్​ తయారీదారుగా భారత్​ త్వరలోనే అవతరించబోతోందని ఆయన అన్నారు. దేశంలో రూ.7.5 లక్షల కోట్ల ఆటోమొబైల్​ పరిశ్రమలను విస్తరింపచేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Last Updated : Jan 14, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.