ETV Bharat / bharat

రాజస్థాన్​లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యూపీలో నిరసన- ఎందుకిలా? - రాజస్థాన్ జాబ్ నిరసనలు

Unemployed youth protest: నిరుద్యోగ యువకుల నిరసన రాష్ట్ర సరిహద్దులు దాటింది. 49 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని.. పక్క రాష్ట్రానికి వెళ్లి నిరసన చేపట్టారు యువకులు.

Unemployed Youth of Rajasthan protests
నిరుద్యోగ నిరసనలు
author img

By

Published : Dec 1, 2021, 6:18 PM IST

Unemployed Protest Rajasthan: రాజస్థాన్ జైపుర్​లో షహీద్ స్మారక్ వద్ద 49 రోజులుగా నిరసన చేస్తున్న నిరుద్యోగ యువకులు.. తమ ఆందోళనలను సరిహద్దు దాటించారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల.. కొంత మంది యువకులు ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకు చేరుకొని నిరసన తెలుపుతున్నారు. నిరుద్యోగ సంఘం నాయకుడు ఉపెన్ యాదవ్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

d
బయటే నిద్రిస్తున్న యువకులు
Unemployed Youth of Rajasthan reach Lucknow
హోర్డింగుల కింద నిరసనకారులు

Rajasthan Unemployed Protest UP:

రాజస్థాన్ బేరోజ్​గార్ ఏకీకృత్ మహాసంఘ్(ఆర్​బీఈఎం) ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. రిక్రూట్​మెంట్ పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, పరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినవారిని కఠినంగా శిక్షించేలా చట్టాన్ని తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

నిరుద్యోగ యువకులు

తాజా నిరసనలు గహ్లోత్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఉత్తర్​ప్రదేశ్​లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఇది కాంగ్రెస్​కు చేటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీటిని గ్రహించిన గహ్లోత్.. నిరసనలపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళన చేస్తున్న యువకులకు ఉద్యోగాలు అవసరం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: 50 చోట్ల ఐటీ సోదాలు- రూ.500 కోట్ల నల్లధనం గుర్తింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.