ETV Bharat / bharat

విషాదం- ట్రెక్కింగ్​కు వెళ్లి 12 మంది దుర్మరణం - ట్రెక్కింగ్​

ఉత్తరాఖండ్​లో ట్రెక్కింగ్​కు వెళ్లిన రెండు వేర్వేరు బృందాల్లోని 12మంది పర్వతారోహకులు మరణించారు(uttarakhand trekking death). ఆరుగురిని అధికారులు రక్షించారు. నలుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. ఉత్తరాఖండ్​లో అకాల వర్షాల వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణమే వారి మరణానికి కారణమని తెలుస్తోంది(uttarakhand flood 2021).

U'khand rains: Bodies of 12 trekkers recovered

author img

By

Published : Oct 23, 2021, 12:08 PM IST

ఉత్తరాఖండ్​లో విషాదం చోటుచేసుకుంది. ట్రెక్కింగ్​ కోసం రెండు వేరు వేరు బృందాలుగా వెళ్లిన పర్వతారోహకుల్లో 12మంది మరణించారు(uttarakhand trekking death). వీరి మృతదేహాలను లంఖగ పాస్​ వద్ద అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఆరుగురిని రక్షించగా.. మరో నలుగురి ఆచూకీ ఇంకా లభించలేదు.

హిమాచల్​ప్రదేశ్​ కన్నౌర్​ జిల్లాలోని చిట్​కుల్​కు..​ ఉత్తరాఖండ్​ ఉత్తరకాశీ జిల్లాలోని హర్షిల్​కు లంఖగ పాస్​ అనుసంధానంగా ఉంటుంది. ఉత్తరాఖండ్​ అకాల వర్షాల వల్ల ఏర్పడిన ప్రతికూల వాతావరణం ఈ ఘటనకు కారణం(uttarakhand flood 2021).

హర్షిల్​ వద్ద పర్వతారోహకులు గల్లంతయ్యారన్న వార్త తెలుసుకుని గాలింపు, సహాయక చర్యలు చేపట్టినట్టు ఉత్తరాఖండ్​ డీజీపీ అశోక్​ కుమార్​ వెల్లడించారు. తొలుత.. 11 మంది సభ్యుల ట్రెక్కర్స్​ బృందంలో ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు, మరో ఇద్దరిని రక్షించినట్టు, మరో ఇద్దరు గల్లంతైనట్టు ఆయన వివరించారు. అనంతరం మరో 11 మంది సభ్యులతో కూడిన బృందంలో 5 మృతదేహాలు లభించాయని, నలుగురిని కాపాడినట్టు, మరో ఇద్దరి ఆచూకీ ఇంకా అందలేదని వెల్లడించారు.

మృతుల్లో కొందరిని.. అనితా రావత్​(38), తన్​మై తివారీ(30), వికాస్​ మకల్​(33), సౌరభ్​ ఘోష్​(34), సుభయాన్​ దాస్​(28), రిచర్డ్​ మండల్​(31), ఉపేంద్రగా (22) గుర్తించారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్​ కోసం 32 మంది పోలీసు/ఐటీబీపీ సిబ్బందిని రంగంలోకి దింపినట్టు హిమాచల్​ప్రదేశ్​ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.