ETV Bharat / bharat

'ఆధార్' సంస్థలో​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​.. అప్లై చేయడం ఇలా.. - aadhar card jobs in delhi

UIDAI Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఆశావాహులకు గుడ్​ న్యూస్. యూఐడీఏఐ(ఆధార్​) సంస్థలో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఏ విభాగంలో ఎన్ని పోస్టులు, జీతభత్యాలు ఎంత, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

UIDAI RECRUITMENT 2023
UIDAI రిక్రూట్‌మెంట్ 2023
author img

By

Published : May 3, 2023, 2:45 PM IST

UIDAI Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్ చెప్పింది సర్కార్​. 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ' (యూఐడీఏఐ)- ఆధార్​ సంస్థలో పనిచేయాలని కోరుకునే వారి కోసం ఉద్యోగాల​ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. దిల్లీలోని UIDAI ప్రాంతీయ కార్యాలయంలోని వివిధ పోస్టులకు డిప్యుటేషన్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీలు, జీతం వివరాలు ఇలా..
దిల్లీలోని UIDAI ప్రాంతీయ కార్యాలయంలోని 4 పోస్టులకు డిప్యుటేషన్ (ఫారిన్ సర్వీస్ టర్మ్ ప్రాతిపదికన) పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగానికి ఎంపికైన వారు 5 సంవత్సరాల పాటు సేవలు అందించొచ్చు. UIDAI రిక్రూట్‌మెంట్ 2023 ప్రకారం భర్తీ కానున్న ఈ పోస్టులకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే పే మ్యాట్రిక్స్ లెవల్ 05 నుంచి లెవల్​ 11 మధ్య వేతనాన్ని పొందొచ్చు.

గరిష్ఠ వయసు.. ఈ వెబ్​సైట్​లో అప్లై..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 56 ఏళ్ల లోపు ఉండాలి. ఆసక్తి ఉన్న వారు UIDAI (uidai.gov.in) వెబ్​సైట్​లో నిర్దేశించిన ఫార్మాట్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు భర్తీ..

  1. అసిస్టెంట్ అకౌంట్​ ఆఫీసర్​
  2. అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్​
  3. డిప్యూటీ డైరెక్టర్​
  4. అకౌంటెంట్​

కావాల్సిన విద్యార్హతలు:

  • అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్- చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్/ ఎంబీఏ. కంప్యూటరైజ్డ్ ఆఫీసు వాతావరణంలో పని చేయడానికి ప్రాథమిక నైపుణ్యాలు.
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- అడ్మినిస్ట్రేషన్/ లీగల్/ ఎస్టాబ్లిష్‌మెంట్/ హ్యూమన్ రిసోర్సెస్/ ఫైనాన్స్/ అకౌంట్స్/ బడ్జెట్ I విజిలెన్స్/ ప్రొక్యూర్‌మెంట్/ ప్లానింగ్ అండ్ పాలసీ/ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్/ మానిటరింగ్/ ఈగవర్నెన్స్ మొదలైన వాటిలో పని అనుభవం. కంప్యూటరైజ్డ్ ఆఫీసు వాతావరణంలో పని చేయడానికి ప్రాథమిక నైపుణ్యాలు.
  • డిప్యూటీ డైరెక్టర్​- అడ్మినిస్ట్రేషన్/ లీగల్/ ఎస్టాబ్లిష్‌మెంట్/ హ్యూమన్ రిసోర్సెస్/ ఫైనాన్స్/ అకౌంట్స్/ బడ్జెట్/ విజిలెన్స్/ ప్రొక్యూర్‌మెంట్/ ప్లానింగ్ అండ్ పాలసీ/ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్/ మానిటరింగ్/ ఈగవర్నెన్స్ మొదలైన వాటిలో అనుభవం. కంప్యూటరైజ్డ్ ఆఫీసు వాతావరణంలో పని చేయడానికి ప్రాథమిక నైపుణ్యాలు.
  • అకౌంటెంట్- కామర్స్‌లో గ్రాడ్యుయేషన్​(డిగ్రీ). కంప్యూటరైజ్డ్ ఆఫీసు వాతావరణంలో పని చేయడానికి ప్రాథమిక నైపుణ్యాలు.

ఈ పోస్టుకు ఇంత జీతం..

UIDAI రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023 ప్రకారం..

  • అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్​లో చేరేవారు పే మ్యాట్రిక్స్ లెవెల్-08 ప్రకారం జీతం పొందుతారు.
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్​లో చేరేవారు పే మ్యాట్రిక్స్ లెవెల్-06 ప్రకారం జీతం పొందుతారు.
  • డిప్యూటీ డైరెక్టర్ పే పోస్ట్​లో చేరేవారు పే మ్యాట్రిక్స్ లెవెల్-11 ప్రకారం జీతం పొందుతారు.
  • అకౌంటెంట్ పే పోస్ట్​లో చేరేవారు పే మ్యాట్రిక్స్ లెవెల్-05 ప్రకారం జీతం పొందుతారు.

దరఖాస్తుకు చివరి తేదీ!

UIDAI రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ప్రకారం పైన తెలిపిన పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2023 జూన్​ 12.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.