ETV Bharat / bharat

పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు- ఇద్దరు ఉపాధ్యాయులు మృతి

శ్రీనగర్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళా టీచర్​ ఉన్నారు. ఈ దాడిని ఖండించారు జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా. ఉగ్రవాదులకు తగిన సమాధానం చెబుతామన్నారు.

Firing in school in srinagar
పాఠశాలలో కాల్పుల కలకలం
author img

By

Published : Oct 7, 2021, 12:33 PM IST

Updated : Oct 7, 2021, 2:28 PM IST

కశ్మీర్‌లో మైనార్టీలే లక్ష్యంగా ఉగ్రవాదులు వరుసగా దాడులకు తెగబడుతున్నారు. రెండ్రోజులక్రితం ఓ కశ్మీర్‌ పండిట్‌సహా ఇద్దరు పౌరులను కాల్చిచంపిన ఘటన మరువకముందే శ్రీనగర్‌లో.. మరో ఇద్దరు మైనార్టీలను చంపారు. సంగం ఈద్గా ప్రాంతంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు సహా మరో టీచర్​ను కాల్చి చంపారు. వారిలో ఒకరు కశ్మీర్‌ పండిట్‌ కాగా, మరొకరు సిక్కు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉదయం 11.15 నిమిషాలకు జరిగినట్లు చెప్పారు.

ఉగ్రదాడి సమాచారం అందిన వెంటనే దుండగులను పట్టుకునేందుకు.. ఆప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

రెండ్రోజుల ముందు ముగ్గురి హత్య..

రెండ్రోజుల ముందు కూడా శ్రీనగర్‌కు చెందిన ప్రముఖ ఫార్మసి యజమాని, కశ్మీర్‌ పండిట్‌సహా మరో ఇద్దరు పౌరులను ఉగ్రమూకలు కాల్చిచంపాయి. గంటన్నర వ్యవధిలోనే ఈ ముగ్గుర్ని చంపారు. ప్రముఖ కశ్మీర్‌ పండిట్‌, వ్యాపారవేత్త అయిన మఖన్‌లాల్‌ బింద్రూ.. ఇక్బాల్‌ పార్క్‌లోని తన దుకాణంలో మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఔషధాలు బట్వాడా చేస్తుండగా.. దుండగులు పాయింట్‌ బ్లాంక్‌లో ఆయన్ను కాల్చిచంపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. ఆ తర్వాత హవల్‌ చౌక్‌ ప్రాంతంలో రోడ్డువెంట పానీపూరి విక్రయించే బిహార్‌ బాగల్‌పూర్‌కు చెందిన వీరేంద్ర పాసవాన్‌ను కూడా ఉగ్రవాదులు కాల్చిచంపారు. అనంతరం బందిపొర జిల్లాలో ఓ కారు డ్రైవర్‌ను ఉగ్రమూకలు కాల్చిచంపాయి. నిషేధిత లష్కర్‌ తొయిబాకు అనుబంధ సంస్థగా భావిస్తున్న టీఆర్​ఎఫ్​.. ఈ హత్యలకు బాధ్యత తీసుకుంది.

మరోవైపు.. తమవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు వరుసగా దాడులకు తెగబడటం వల్ల కశ్మీర్‌ పండిట్లకు చెందిన వివిధ సంఘాలు జమ్ములో ఆందోళనకు దిగాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ వర్గాన్ని ఉగ్రవాదులు టార్గెట్‌ చేసిన నేపథ్యంలో.. భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.

భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే దాడులు..

కశ్మీర్​ లోయలోని మైనారిటీలపై చేస్తున్న ఉగ్రవాదుల దాడులు.. భయానక వాతావరణాన్ని సృష్టించి, పురాతనమైన మత సామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా చేస్తున్నవేనన్నారు జమ్ముకశ్మీర్​ పోలీస్​ చీఫ్​ దిల్బాగ్​ సింగ్​. సాధారణ పౌరులపై వరుస దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన దాడులపై దర్యాప్తు ముమ్మరం చేశామని, శ్రీనగర్​ పోలీసులు పలు ఆధారాలు సంపాదించినట్లు చెప్పారు సింగ్​. ఈ ఘటనల వెనక ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పాకిస్థాన్​ ఆదేశాలతో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని, కశ్మీర్​ లోయలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు చెప్పారు.

పాఠశాల ఘటనను ఖండించిన గవర్నర్​

శ్రీనగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులపై కాల్పులు జరిపి హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​​ మనోజ్​ సిన్హా. 'అమాయక ప్రజలపై ఉగ్రదాడులకు పాల్పడుతున్న వారికి తగిన సమాధానం చెబుతాం. జమ్ముకశ్మీర్​ పురోగతి, శ్రేయస్సు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనుకునే ఉగ్రవాదులు, వారి అనుచరులు సఫలం కాలేరు.' అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

Last Updated : Oct 7, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.