ఇన్‌స్టా, యూట్యూబ్ రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లకు లైక్‌లు, కామెంట్ల కోసం ఎంతకైనా తెగించి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ధోరణి చాలా పెరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రమాదకరంగా రీల్స్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు.. రైలు కింద పడ్డారు. వారిద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను కరణ్, శశాంక్‌లుగా పోలీసులు గుర్తించారు. శనివారం ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు ఇద్దరూ రాష్ట్రంలోని మెయిన్‌పురి జిల్లాలోని భికాన్‌పుర్ గ్రామానికి చెందినవారు. వారు సమీపంలోని ధోల్‌పురా గ్రామానికి కూలీ పనుల కోసం వెళ్లారు. రీల్స్ కోసం పట్టాల దగ్గర వీడియోల చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరూ చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకున్నారు. దీంతో వారికి రైలు వస్తున్న శబ్దం వినపడలేదు. అనంతరం వారిద్దరిని రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. పోస్ట్‌మార్టం పరీక్షల నిమిత్తం మృతదేహలను ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి:
పెళ్లి కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసిన జంట... వీడియో వైరల్