మహారాష్ట్రలోని ముంబయిలో విషాదకర ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ పెద్ద భవనం పై నుంచి బండ రాయి పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముంబయిలోని వర్లీ ప్రాంతంలో ఓ భారీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 9.40 ప్రాంతంలో 42వ అంతస్తు నుంచి ఓ పెద్ద రాయి.. ఒక్కసారిగా కింద పడింది.
ఆ సమయంలో అటు వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై ఆ రాయి పడింది. దీంతో వారిద్దరూ మరణించారు. ఘటనాస్థలిలో ఉన్న అనేక కార్లపై కూడా రాళ్లు పడ్డాయి. అద్దాలపై రాళ్లు పడటం వల్ల కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను సబిర్ అలీ, ఇమ్రాన్ అలీఖాన్గా పోలీసులు గుర్తించారు.
![Two people died after a large brick fell from under construction building in Worli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17756892_peoee.jpg)
![Two people died after a large brick fell from under construction building in Worli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17756892_pooee.jpg)
ఆరేళ్ల పై హత్యాచారం..
అసోంలోని సోనిత్పుర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. టీ తోటలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత బాలికను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంటనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.