ETV Bharat / bharat

భక్తులకు అలర్ట్​ - దీపావళి రోజున తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!

TTD Cancels VIP Break Darshan Instead of Diwali Asthanam : దీపావళి పండగ రోజున శ్రీవారి దర్శనం చేసుకుందామని తిరుమల వెళ్తున్నారా..? అయితే మీకో అలర్ట్​. ఆ రోజు దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 11:17 AM IST

TTD Cancels VIP Break Darshan On Diwali Day
TTD Cancels VIP Break Darshan Instead of Diwali Asthanam

TTD Cancels VIP Break Darshan Instead of Diwali Asthanam : తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు.. భక్తులు నిత్యం వేలాదిగా తరలివస్తుంటారు. అయితే.. పండగ వేళ స్వామి సన్నిధిలో గడపాలని చాలా మంది కోరుకుంటారు. మరి.. మీరు కూడా దీపావళి పండగ నాడు స్వామి వారిని దర్శనానికి వెళ్లాలనుకుంటే.. ఈ విషయం తెలుసుకోండి. దీపావళి రోజున దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Diwali Asthanam in Tirumala: ఈ నెల 12న దీపావళి సందర్భంగా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వీఐపీ బ్రేక్​ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రొటోకాల్ దర్శనం మినహా.. మిగిలిన బ్రేక్ దర్శనాలన్నీ రద్దు చేసినట్లు ప్రకటించింది. అదేవిధంగా.. నవంబర్​ 11న బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని వెల్లడించింది. ఆస్థానం కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌ల‌ను రద్దు చేయగా.. అర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లు విడుదల!

దీపావళి నాడు తిరుమలలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహించనుంది టీటీడీ. ముందుగా ఘంటా మండపంలో.. సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా ఉంటారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగుస్తుంది. సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌ స్వామి వారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భక్తులకు దర్శనం ఇస్తారు.

శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుమల కొండపై ఈ 5 తప్పులు చేయకండి!

Padmavathi Brahmotsavam 2023: నవంబర్​ 10 శుక్రవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం నాడు లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీ. బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో గురువారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తిరోజూ ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహ‌న‌ సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

TTD Navaratri Brahmotsavam in Tirumala : తిరుపతి వెళ్తున్నారా..? ఈ విషయం తెలుసా? లేదంటే ఇబ్బందులు ఖాయం!

TTD Vaikunta Ekadasi Darshan Tickets Released: డిసెంబర్​ 23న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని.. వెంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ (నవంబర్ 10) విడుదల చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు కొనసాగనున్న.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల(ఎస్‌ఈడీ)ను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్​లైన్​లో ఉంచింది. భక్తులు ttddevasthanam.ap.gov.in వెబ్​సైట్​లో టికెట్లు బుక్​ చేసుకోవాలని సూచించింది.

IRCTC Hyderabad to Tirupati Tour : హైదరాబాద్ To తిరుపతి.. హ్యాపీగా శ్రీనివాసుడి దర్శనం.. టికెట్ ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.