హిమాచల్ ప్రదేశ్‌లో విషాద ఘటన జరిగింది. మీర్పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు అభంశుభం తెలియని చిన్నారులు తండ్రి తుపాకీతో ఆడుకున్నారు. తుపాకీ చేతిలో పట్టుకున్న అన్నయ్య అకస్మాత్తుగా ట్రిగ్గర్ బటన్ నొక్కేయడం వల్ల బుల్లెట్ తన రెండేళ్ల తమ్ముడి నోటి నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పిల్లవాడు అక్కడిక్కడే మృతి చెందాడు.
ఇదీ జరిగింది.. జిల్లాలోని హమీర్పుర్ సమీపంలో ఉన్న ఉమరీ గ్రామానికి చెందిన జైరాం కుమారుడు బాలాదిన్ కుష్వహా.. ముస్క్రా డెవలప్మెంట్ బ్లాక్‌లో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. బుల్లెట్లతో నిండి ఉన్న తుపాకీని శుక్రవారం మధ్యాహ్నం.. గదిలో పెట్టి వేరే పనులు చూసుకుంటున్నాడు. అది గమనించిన బాలాదిన్ ఇద్దరు కుమారులు గదిలోకి వెళ్లి తుపాకీతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఒకరినొకరు పిస్టల్‌తో చంపుకున్నట్టు ఆడుకున్నారు. అకస్మాత్తుగా బాలాదిన్ పెద్ద కొడుకు తుపాకీ ట్రిగ్గర్ బటన్ నొక్కేశాడు. చిన్న కొడుకు సిద్ధార్థ్(2) నోటి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలుడ్ని.. ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండాపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినందున ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని రద్దుకు పంపామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: సరిహద్దు దాటి భారత్‌లోకి మూడేళ్ల బాలుడు.. జవాన్లు ఏం చేశారంటే?
స్పైస్‌జెట్ విమానంలో పొగలు.. 5వేల అడుగుల ఎత్తులో.. కానీ లక్కీగా..