ETV Bharat / bharat

పెళ్లితో ఒక్కటైన ట్రాన్స్​జెండర్ల జంట- ఇలా దేశంలోనే తొలిసారి!

Transgender Marriage: లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు ట్రాన్స్​జెండర్లు వివాహం చేసుకున్నారు. కేరళ తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది.

transgender marriage
ట్రాన్స్​జెండర్ల వివాహం
author img

By

Published : Feb 14, 2022, 3:29 PM IST

Updated : Feb 14, 2022, 7:52 PM IST

పెళ్లితో ఒక్కటైన ట్రాన్స్​జెండర్ల జంట

Transgender Marriage: కేరళలో అరుదైన పెళ్లి జరిగింది. ఇద్దరు ట్రాన్స్​జెండర్లు వివాహం చేసుకున్నారు. లింగమార్పిడి చేయించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రేమికుల రోజునే ఈ పెళ్లి జరగడం విశేషం.

transgender marriage
పెళ్లి చేసుకున్న ట్రాన్స్​జెండర్లు

శ్యామ ఎస్​ ప్రభ, మను కార్తిక.. పదేళ్లుగా స్నేహితులు. కార్తిక ఓ ప్రైవేటు సంస్థ హెచ్​ఆర్ డిపార్ట్​మెంట్​లో ఉద్యోగి. కేరళ ప్రభుత్వ సంక్షేమ శాఖ ట్రాన్స్​జెండర్ సెల్ కో-ఆర్డినేటర్. ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు లింగమార్పిడి చేయించుకున్నారు. ప్రేమికుల రోజున తిరువనంతపురంలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు.

transgender marriage
వివాహంతో ఒక్కటైన ట్రాన్స్​జెండర్లు

అయితే.. ఈ రకమైన వివాహం చట్టబద్ధం కాదు. దీనిపై వారు కోర్టును ఆశ్రయించనున్నారు. తమ పెళ్లి ట్రాన్స్​జెండర్ వివాహాల్లో సరికొత్త మైలురాయి కానుందని చెప్పారు ప్రభ, మను. ​

ఇదీ చదవండి:

చెట్టు కింద పులి.. కొమ్మలపై ఇద్దరు యువకులు.. గంటలపాటు సస్పెన్స్!

Last Updated : Feb 14, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.