ETV Bharat / bharat

94 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య.. 1951తో పోలిస్తే ఆరు రెట్లు పెరుగుదల - 2022 నాటికి భారతదేశంలో ఓటర్ల సంఖ్య

దేశంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు చేరిందని ఈసీ వెల్లడించింది. కాగా ఈ మొత్తం ఓటర్లలో సుమారు 31.50 కోట్ల మంది ఓటర్లు గత 2019 లోక్​సభ ఎన్నికల ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు ఈసీ చెప్పింది.

Voters In India Ason 2022
Voters In India
author img

By

Published : Feb 5, 2023, 10:50 PM IST

దేశంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 1951లో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల శాతం ఆరు రెట్లు ఎక్కువని ఈసీ తెలిపింది. సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఈ ఏడాది జనవరి 1 నాటికి 94,50,25,694 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా ఈ మొత్తం ఓటర్లలో సుమారు 31.50 కోట్ల మంది ఓటర్లు గత 2019 లోక్​సభ ఎన్నికల ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు ఈసీ చెప్పింది. వీరిలో ఎక్కువ శాతం మంది ఓటర్లు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు, యువతతో పాటు వలస వెళ్లిన వారే ఉన్నారని ఈసీ నివేదికలో పేర్కొంది.

1951 నుంచి 2019 వరకు ఓటింగ్​ సరళి క్లుప్తంగా..

⦁ 1951లో మొదటిసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో కేవలం 45.67 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

⦁ 1957లో జరిగిన జనరల్​ ఎలక్షన్స్​ సమయానికి 19.37 కోట్ల మంది ప్రజలు ఓటు వేసేందుకు అర్హులుగా ఉంటే అందులో కేవలం 47.74 శాతం మంది ఓటు వేశారు.

⦁ 1962 సాధారణ ఎన్నికల్లో 21.64 కోట్ల మంది ఓటర్లలో 55.42 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో దేశ చరిత్రలోనే మొదటిసారిగా 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్​ నమోదైంది.

⦁ 2009 నాటికి మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 71.70 కోట్లకు పెరిగింది. అయితే ఆ ఏడాదిలో జరిగిన పోలింగ్​లో 58.21 శాతం మంది మాత్రమే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.

⦁ 2014 సాధారణ ఎన్నికల సమయానికి మొత్తం 83.40 కోట్ల మంది ఓటర్లుగా జాబితాలో చేరగా.. 66.44 శాతం ప్రజలు తమ ఓటును వినియోగించుకున్నారు.

⦁ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 91.20 కోట్లు. కాగా, ఇందులో కేవలం 67.40 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.