ETV Bharat / bharat

టమాటాల వ్యాన్​ హైజాక్.. 2500 కిలోల సరకుతో పరార్

author img

By

Published : Jul 11, 2023, 2:40 PM IST

Tomato Vehicle Robbery : టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. కర్ణాటకలో ఇటీవలె కోసి సిద్ధంగా ఉంచిన టమాటాలను ఎత్తుకెళ్లిన ఘటన మరవకముందే.. మరొకటి జరిగింది. అదే రాష్ట్రంలో రెండున్నర టన్నుల టమాటాల ట్రక్కును ఎత్తుకెళ్లారు దుండగులు.

Tomato Stolen In Karnataka
Tomato Stolen In Karnataka

Tomato Vehicle Robbery : 2.5 టన్నుల టమాటాల వాహనాన్ని హైజాక్ చేశారు ముగ్గురు దుండగులు. టమాటాలను మార్కెట్​కు తరలిస్తుండగా.. మధ్యలో వాహనాన్ని లాక్కుని తీసుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. ఈ ఘటన రెండు రోజుల కింద జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది
చిత్రదుర్గ జిల్లాలోని హిరియూర్​కు చెందిన ఓ రైతు కోలార్‌ మార్కెట్‌కు 2.5 టన్నుల టమాటాలను బొలేరోలో తరలిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్తుండగా.. పక్కనే ఉన్న ఓ కారును ఢీకొట్టింది బొలేరో. దీంతో కారులో ఉన్న ముగ్గురు దుండగులు.. ఆ వాహన డ్రైవర్​, రైతుతో గొడవపడి దాడి చేశారు. అనంతరం వారి నుంచి నష్టపరిహారం కూడా డిమాండ్‌ చేశారు. తమ వద్ద నగదు లేదని వారు చెప్పడం వల్ల.. ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. దీంతో ఆగ్రహించిన నిందితులు.. రైతు, డ్రైవరును రోడ్డుపై వదిలేసి టమాటాల వాహనంతో పారిపోయారు. టమాటాల ఖరీదు సుమారు రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలు ఉంటుందని రైతు వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కోసి సిద్ధంగా ఉంచిన టమాటాల చోరీ
అంతకుముందు కూడా కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళా రైతు పొలంలో 2.5 లక్షలు విలువైన టమాటా పంట చోరీకి గురైంది. 50 నుంచి 60 బస్తాల టమాటాలతో దొంగలు పరారయ్యారు. టమాటాలకు మార్కెట్​లో మంచి డిమాండ్ ఉండడం వల్ల.. పంట కోసి మార్కెట్​కు తరలిద్దామనుకున్న క్రమంలో చోరీ జరిగిందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై.. హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కర్ణాటకలోని హసన్ జిల్లా సోమనహళ్లి గ్రామానికి చెందిన ధరణి టమాటా రైతు. ఈ ఏడాది ధరణి.. తమ కుటుంబ సభ్యులతో కలిసి రెండకరాలలో టమాటా పంట సాగు చేశారు. ఈసారి పంట దిగుబడి బాగా వచ్చిందని.. మార్కెట్​లో కూడా టమాటాలకు డిమాండ్ ఉండడం వల్ల మంచి లాభాలు వస్తాయని వారు ఆశించారు. బెంగళూరు మార్కెట్​లో కిలో టమాటా ధర రూ. 120 పలుకుతున్న క్రమంలో.. పంట కోసి మార్కెట్​కు పంపుదామని అనుకునేలోపు ఇలా జరిగింది. దీంతో మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవీ చదవండి : టమాటాలకు కెమెరాతో భద్రత.. చోరీ భయంతో వ్యాపారి జాగ్రత్తలు

టమాటాలకు ఇద్దరు 'బౌన్సర్ల' సెక్యూరిటీ.. కనీసం ముట్టుకున్నా ఊరుకోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.