ETV Bharat / bharat

టమాటా ఫ్లూ కలకలం.. ఆస్పత్రుల పాలవుతున్న చిన్నారులు! - కేరళలో టమాటా ఫ్లూ కలకలం

Tomato flu Kerala: కేరళలో ఐదేళ్లలోపు పిల్లల్లో వింత జబ్బు కలకలం సృష్టిస్తోంది. టమాటా ఫ్లూగా పిలిచే అత్యంత అరుదైన వైరస్​.. ఇప్పటి వరకు 80 మందికిపైగా చిన్నారులకు సోకింది. టమాటా ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేరళ పొరుగు రాష్ట్రం అప్రమత్తమైంది. సరిహద్దుల్లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తోంది.

Tomato flu Kerala
కేరళలో టమాటా ఫ్లూ కలకలం
author img

By

Published : May 12, 2022, 7:36 AM IST

Tomato flu Kerala: కేరళలో టమాటా ఫ్లూ అనే కొత్త రకం వైరస్‌ కలకలం రేపుతోంది. దీని కారణంగా అనేక మంది చిన్నారులు తీవ్రమైన జ్వరం, ఇతర లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 80 మందికి పైగా చిన్నారులకు టమాటా ఫ్లూ సోకింది. ఈ కేసులన్నీ ఒక్క కొల్లం జిల్లాలోనే నమోదవడం గమనార్హం. టమాటా ఫీవర్‌గా పిలిచే ఈ వైరస్‌ అత్యంత అరుదైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మంపై చాలాచోట్ల ఎర్రటి బొబ్బలు వస్తాయి. అవి టమాటా ఆకారంలో ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు. దీంతో పాటు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బలహీనత, డీహైడ్రేషన్‌ వంటి లక్షణాలు ఉంటాయి. కొందరు పిల్లల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, చేతులు, మోకాళ్లు, పిరుదుల రంగు మారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.

కారణాలపై స్పష్టత కరవు
ఈ వ్యాధికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. టమాటా ఫ్లూ ఇతర ప్రాంతాలకూ వ్యాపించే ప్రమాదముందని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టమాటా ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేరళ పొరుగు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తోంది. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, శరీరంలో నీటిస్థాయి తగ్గకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: కేరళలో మరోసారి షిగెల్లా కలకలం.. కోజికోడ్​​లో తొలి కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.