Stolen Idols Recovered: ఆరు వందల ఏళ్ల నాటి హిందూ దేవతల విగ్రహాలను తమిళనాడు సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.12 కోట్ల విలువైన ఈ విగ్రహాలలో.. నటరాజస్వామి, వేంద్ హరశివ, విష్ణుమూర్తి ప్రతిమలు ఉన్నట్లు సీఐడీ విగ్రహ విభాగం అధికారులు తెలిపారు. పుదుచ్చేరిలోని జోసెఫ్ కొలొంబానీ అనే వద్ద ఈ విగ్రహాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించిన ధ్రువపత్రాలేవీ అతడి వద్ద లేవని పేర్కొన్నారు. 600 ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్న ఈ విగ్రహాలను.. 1980కి ముందు హిందూ దేవాలయాల నుంచి చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
![Puducherry Stolen Hindu idols](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-che-03-idol-script-7202290_13042022145516_1304f_1649841916_805_1304newsroom_1649860412_880.jpg)
![Puducherry Stolen Hindu idols](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-che-03-idol-script-7202290_13042022145516_1304f_1649841916_218_1304newsroom_1649860412_44.jpg)
Puducherry Stolen Hindu idols: ఈ విగ్రహాలు చోళ, విజయనగర సామ్రాజ్యాలు పాలన సాగించిన కాలం నాటివని అధికారులు చెబుతున్నారు. నటరాజ విగ్రహం రెండు అడుగుల ఎత్తు, 23 కేజీల బరువు ఉందని అధికారులు తెలిపారు. దీని విలువే రూ.6 కోట్లు ఉంటుందని చెప్పారు. మిగతా రెండు విగ్రహాలు రూ.3 కోట్ల చొప్పున ఉంటాయని లెక్కగట్టారు. ఈ విగ్రహాలను ఫ్రాన్స్‌కు తరలించాలని నిందితులు గతంలో ప్రయత్నించారని అధికారులు చెప్పారు. అయితే, విగ్రహాలను స్మగ్లింగ్ చేయలేకపోయారని అన్నారు.
![Puducherry Stolen Hindu idols](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-che-03-idol-script-7202290_13042022145516_1304f_1649841916_819_1304newsroom_1649860412_597.jpg)
ఇదీ చదవండి: హక్కులే సర్వస్వం.. సమన్యాయం కోసం అలుపెరగని పోరాటం