ETV Bharat / bharat

ప్రాణాలు తీసిన మద్యం మత్తు.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు ప్రాణ స్నేహితులు మృతి - ap crime updates

Three Persons Died Due to Alcohol intoxication: మద్యం వ్యసనం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మద్యం మత్తులో కృష్ణా నదిలో ఈతకు దిగిన ముగ్గురు ప్రాణ స్నేహితులు ఊబిలో ఇరుక్కుపోయి కన్నుమూశారు. మొన్నటి వరకు కుటుంబంతో ఆనందంగా గడిపిన వారు నేడు విగతజీవులుగా మారిపోవడంతో.. బంధువులు బోరుమన్నారు. కృష్ణాజిల్లా చోడవరం వద్ద కృష్ణానదిలో దిగి చనిపోయినవారిలో రెండు మృతదేహాలు వెలికి తీయగా.. మరొకరి కోసం నేడు గాలింపు చేపట్టనున్నారు.

Three Persons Died Due To Alcohol intoxication

author img

By

Published : Mar 4, 2023, 9:04 AM IST

Three Persons Died Due to Alcohol intoxication: మద్యం మత్తు వారి ప్రాణాలను తీసింది. ఈత సరదా వారిని తమ కుటుంబాలకు కాకుండా చేసింది. నిన్నటి వరకు తమతో కలిసి ఉత్సాహంగా గడిపిన వారు అంతలోనే విగత జీవులుగా మారడం వారి కుటుంబ సభ్యులను కలచి వేసింది. ఇసుక ఊబిలే వారి మరణానికి కారణమని వారు మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా చోడవరం వద్ద కృష్ణా నదిలో ఆహ్లాదంగా గడుపుదామని వెళ్లి.. అసువులు బాసిన తమ వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన రహీమ్‌ బాషా, కాలేషావలి, తాళ్లూరి కిరణ్‌ మంచి స్నేహితులు. రహీమ్‌ జారా బిర్యాని పాయింట్‌ నడుపుతుండటంతో ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు. స్నేహితులతో ఎక్కువగా గడపే రహీమ్‌.. చాలా సార్లు వారితో కలిసి కారులో షికారుకు వెళ్తుంటాడు. అదే విధంగా ఈ ముగ్గురు కలిసి గురువారం సాయంత్రం విజయవాడకు సమీపంలోని చోడవరం వద్ద కృష్ణా నదిలోని ఇసుక తిన్నెలపై మద్యం సేవించేందుకు వెళ్లారు. రహీమ్‌ బిర్యానీ పాయింట్‌లో పని చేసే అజ్గర్‌కు ఫోన్‌ చేసి పిలిపించుకుని అందరూ కలిసి రాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు. 9 గంటల సమయంలో సరదాగా నదిలో స్నానం చేయాలనుకున్న స్నేహితులు.. బట్టలు, ఫోన్లు, వస్తువులన్నీ కారులోనే పెట్టి నీటిలోకి దిగారు.

రహీమ్‌, కాలేషా వలి, తాళ్లురి కిరణ్‌ నదిలో దిగగా.. అజ్గర్‌ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయాన్నే చేపలు పట్టేందుకు జాలర్లు నదిలోకి దిగగా.. ఓ మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని కారులో ఉన్న ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలేషావలిని గుర్తించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇటీవలే జరిగన ఓ వేడుకలో అందరం కలిసి ఉత్సాహంగా గడిపామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ కన్నీరుమున్నీరయ్యారు.

పోలీసులు అజ్గర్‌ను ప్రశ్నించగా.. ముగ్గురూ నదిలోకి దిగినట్లు తెలిపాడు. గజ ఈతగాళ్లు, జాలర్లతో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో.. మధ్యాహ్నం NDRF సిబ్బందిని రంగంలోకి దింపగా.. రహీమ్ బాషా మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. కిరణ్ మృతదేహం కోసం గాలించినా దొరకలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. భర్త మృతదేహాన్ని చూసి తట్టుకోలేని కాలేషావలి భార్య.. నదిలోకి దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను కాపాడారు.

ఈత వచ్చినా మద్యం మత్తులో ఉండటం వల్లే ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఊబిలు ఎక్కువగా ఉండటం వల్ల..హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు. భార్యా బిడ్డలతో ఆనందంగా గడిపిన స్నేహితులు విగతజీవులుగా మారడం చూసి అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. కిరణ్‌ మృతదేహాం కోసం నేడు గాలింపు చేపట్టనున్నారు.

ప్రాణాలు తీసిన మద్యం మత్తు.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు ప్రాణ స్నేహితులు మృతి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.