ETV Bharat / bharat

రూ.800 కోసం గొడవ.. తల్లి ఎదుటే కత్తులతో పొడిచి హత్య.. ప్రిన్సిపల్​పై పెట్రోల్ పోసి.. - Three people stabbed two for Rs 800

ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. రూ.800 కోసం ఇద్దరు అన్నదమ్ములను పొడిచారు ముగ్గురు వ్యక్తులు. అందులో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మహిళా ప్రిన్సిపల్​పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ విద్యార్థి. మధ్యప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

three-arrested-killing-youth-over-rs-800-in-durg-chhattisgarh
రూ. 800 కోసం గొడవ.. అన్నదమ్ములను పొడిచిన ముగ్గురు వ్యక్తులు
author img

By

Published : Feb 20, 2023, 11:09 PM IST

ఇద్దరు సోదరులను కత్తితో పొడిచారు ముగ్గురు వ్యక్తులు. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రూ. 800 చెల్లించే విషయంలో జరిగిన వివాదం.. ఈ ఘాతూకానికి కారణం అయింది. చత్తీస్​గఢ్​లో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గ్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్​ పరిధిలో ఘటన జరిగింది. ఆదివారం గజేంద్ర విశ్వకర్మ.. అతని సోదరుడిని ముగ్గురు వ్యక్తులు కత్తితో పొడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల అమ్మ, స్నేహితుల ముందే ఈ దారుణం జరిగింది.

ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. "ఆదివారం రెండు వర్గాల మధ్య చిన్న గొడవ జరిగింది. అదే గొడవలో ఇద్దరు అన్నదమ్ములను ముగ్గురు వ్యక్తులు దారుణంగా పొడిచారు. మొదట గజేంద్ర విశ్వకర్మపై దాడి చేయగా.. అతని సోదరుడు అడ్డగించే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని కూడా కత్తితో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు." అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం తీవ్రంగా గాలింపులు జరిపినట్లు తెలిపారు. అనంతరం సోమవారం ఉదయం నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మహిళా ప్రిన్సిపల్​పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి..
మధ్యప్రదేశ్​ ఇందౌర్​లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా ప్రిన్సిపల్​పై మాజీ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ప్రిన్సిపల్ ఆస్పత్రిలో చేరారు. సిమ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎం పటేల్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని పోలీసులు అశోతోశ్​గా గుర్తించారు. 'ప్రిన్సిపల్ శర్మ శరీరం 80శాతం కాలిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. పాత విషయాలు ఏవో మనసులో పెట్టుకొనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భావిస్తున్నాం. బాధితురాలు మాట్లాడే స్థితిలో లేనందున స్టేట్​మెంట్ ఇంకా రికార్డు చేయలేదు. ఘటన సమయంలో నిందితుడికి కూడా గాయాలయ్యాయి. అతడిని అరెస్టు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది' అని రూరల్ ఎస్పీ భగవత్ సింగ్ విర్దే వెల్లడించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.