Indians in Ukraine: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 250 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్ ఇండియా రెండో విమానం దిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రెయిన్లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని సూచించారు. సురక్షితంగా భారత్కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
![second flight from Bucharest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14581108_kkkk.jpg)
![second flight from Bucharest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14581108_thum.jpg)
![second flight from Bucharest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14581108_kkkkkk.jpg)
![second flight from Bucharest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14581108_kkkkkk111.jpg)
ఇప్పటికే రొమేనియా నుంచి 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్ ఇండియా తొలి విమానం ముంబయికి చేరుకుంది.
ఇదీ చూడండి:
ఉక్రెయిన్లో చిక్కుకున్న కుమార్తెను తీసుకొస్తానంటూ మహిళకు టోకరా