Thane building collapse today : మహారాష్ట్ర ఠానే జిల్లాలో భవనం స్లాబ్ కూలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఉల్హాస్నగర్ పురపాలక సంస్థ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు.


ఉల్హాస్‌నగర్‌లోని క్యాంప్ నంబర్-5 ప్రాంతంలో మానస్ టవర్ పేరిట ఓ ఐదంస్తుల భవనం ఉంది. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవంతిలో 30 ఫ్లాట్లు ఉన్నాయి. భవనం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ఖాళీ చేయాలని అందులో నివసించే వారికి ఉల్హాస్నగర్ పురపాలక సంస్థ అధికారులు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఇంకా ఐదు కుటుంబాలు ఆ భవనంలోనే నివసిస్తున్నాయి. ఇంతలోనే.. గురువారం ఉదయం 11.30 ప్రాంతంలో ఒక్కసారిగా నాలుగో అంతస్తు స్లాబ్ కూలింది. ఫలితంగా.. ఆ కింద అంతస్తుల స్లాబ్‌లు కూడా కూలి.. గ్రౌండ్ ఫ్లోర్లో శిథిలాలు పడ్డాయి.