ETV Bharat / bharat

తాడేపల్లి కేంద్రంగా వైసీపీలో తుపాను - 'టికెట్ రాకున్నా హ్యాపీ - ఓడిపోవడం కంటే అదే బెటర్' - janasenaparty

Tension in Ysrcp : ఎమ్మెల్యేలపై అధినేతకు, అధినేతపై ఎమ్మెల్యేల్లో నమ్మకం సన్నగిల్లింది. ఎన్నికల నోటిఫికేషన్ ముందే రానుందన్న సమాచారానికి తోడు సొంత సర్వేల్లో వచ్చిన ఫలితాలపై జగన్​ తీవ్ర ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోటీ చేసి ఓడిపోవడం కంటే టిక్కెట్ రాకపోవడమే బెటర్ అంటూ కొందరు అభ్యర్థులు అనుచరుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వైసీపీలో ఓ వర్గం పెత్తనం చేస్తోందన్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాంబాబు, తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

tension_in_ysrcp
Etv Bharatతాడేపల్లి కేంద్రంగా వైసీపీలో తుపాను - 'టికెట్ రాకున్నా హ్యాపీ - ఓడిపోవడం కంటే అదే బెటర్'
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 5:27 PM IST

Updated : Dec 27, 2023, 6:51 PM IST

Tension in YSRCP : వైసీపీలో తుపాను మొదలైందా? తెలంగాణలో అధికార మార్పిడి ఏపీ ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోందా? ఏపీలోనూ మార్పు ఖాయమనే సంకేతం అధికార పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోందా? భారీ స్థాయిలో సిట్టింగులకు నో ఛాన్స్ అని ప్రకటించిన అధిష్ఠానం.. మంత్రుల స్థానాలకూ ఎసరు పెట్టింది. ముఖ్య నేతలకు బుజ్జగింపులు, నియోజకవర్గ ఇన్​చార్జుల మార్పు, ఎమ్మెల్యేల స్థాన చలనం ఆ పార్టీలో కల్లోల పరిస్థితికి అద్దం పడుతోంది. ఓటమి భయంతో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ద్వితీయ శ్రేణి నాయకత్వం చర్చించుకుంటోంది.

భగవంతుడి దయ వల్ల వైసీపీ నుంచి ఓడిపోవడం మంచిదైంది - దగ్గుబాటి

నమ్మకం పోయింది.. మార్పు ఖాయమే!

జగన్​కు నమ్మిన బంటుల్లా పనిచేసిన వారిపైనా బదిలీ వేటు పడడం గమనిస్తే ఏపీలో అధికార మార్పిడి ఖాయమనే సంకేతాలు ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా (resignation) చేసి టీడీపీలో చేరగా, మరికొందరు హేమాహేమీలు సైతం అందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అధినేతపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలపై అధినేతకు నమ్మకం సన్నగిల్లింది. 'అభ్యర్థులపై నమ్మకం కాదు - గెలుస్తామనే నమ్మకం జగన్​కు లేదు' అని ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నాయకుడొకరు క్యాడర్​తో జరిగిన సమావేశంలో వివరణ ఇచ్చుకోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయంపై జగన్​లో ఆందోళన నెలకొందని, అందుకే అభ్యర్థులను మార్చుతున్నారంటూ మరో మహిళా నేత వ్యాఖ్యానించడం గమనార్హం.

టికెట్​ వస్తే సేవ చేస్తాం.. రాకున్నా హ్యాపీ!

వచ్చే ఎన్నికల్లో జయాపజయాలపై ఇప్పటికే అంచనాకు వచ్చిన కొందరు అధికార పార్టీ (Ruling party) ఎమ్మెల్యే అభ్యర్థులు ముందస్తుగా పావులు కదుపుతున్నారు. ఓ వైపు ఇతర పార్టీల నేతలతో మంతనాలు జరుపుతూనే స్థాన చలనంపై ఏం చేయాలని అనుచరులతో సమాలోచన కొనసాగిస్తున్నారు. వైసీపీలోనే ఉండి మళ్లీ పోటీ చేసి ఓడిపోవడం కంటే అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమంటూ తప్పుకోవడం మంచిదని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని మార్పులు ఖాయమంటున్న వైసీపీ అధిష్ఠానం - తాడేపల్లిలో చర్చోపచర్చలు

జగన్​తో మనం ఇమడలేం
తాను వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడమే మంచిదైందని ఇటీవల దగ్గుబాటి (Daggubati) వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి. బాపట్ల జిల్లా కారంచేడులో పర్యటించిన దగ్గుబాటి, ప్రజలు తనను గెలిపించినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగగలిగే వాడిని కాదంటూ గుంతల రోడ్లను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఓడిన రెండు నెలల తర్వాత జగన్ పిలిపించి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని చెప్పారని గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు మనం ఇమడలేం అనుకుని, రాజకీయాలు వద్దు అని సున్నితంగా తిరస్కరించినట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు.

సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపుతో ఆందోళన
'అభ్యర్థుల మార్పిడి అంశం వైసీపీ (YSRCP) లో తీవ్ర వాయుగుండానికి కారణమైంది. అది తుపానుగా మారి తీరం దాటేందుకు సమయం ఆసన్నమైంది' అని ఏపీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ఇన్​చార్జుల మార్పులపై పార్టీ క్యాడర్​లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ నాయకుడిని బదిలీ చేయడంతో పాటు స్థానికేతరులకు అవకాశాలు కల్పించడంపై భగ్గుమంటోంది. తాజా పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నా మంటలు అంటుకునేందుకు ఎంతో దూరం లేదని తెలుస్తోంది.

గోదావరి జిల్లాల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పు - సీఎం జగన్​ను కలిసిన ఎమ్మెల్యేలు

అధికార పార్టీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సొంత పార్టీలోని ఓ సామాజిక వర్గంపై నిప్పులు చెరిగారు. పార్టీలో ఓ సామాజిక వర్గం ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తననే లక్ష్యంగా చేసుకుని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన 34సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉన్న మాగుంట కుటుంబం ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని ఆదరించవద్దని నియోజకవర్గ ప్రజలను అన్నా రాంబాబు కోరారు.

విశాఖ జిల్లాలో భారీ కుదుపు...

విశాఖ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వంశీకృష్ణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Last Updated : Dec 27, 2023, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.