ETV Bharat / bharat

Tension at CBN Tour: రాళ్లు రువ్విన వైసీపీ శ్రేణులు.. ఖబడ్దార్​ అంటూ హెచ్చరించిన చంద్రబాబు - Tension at Chandrababu Yerragondapalem TOUR

Tension at CBN TOUR: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన వేళ.. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా నాయకులు రాళ్లు విసరడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, మా జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. వైకాపా పాలనలో రౌడీలు రోడ్డు మీదకు వస్తున్నారన్న చంద్రబాబు.. నా ముందు కుప్పిగంతులు వేయవద్దని హెచ్చరించారు. జగన్‌ లాంటి రాజకీయ నాయకుడిని దేశంలో ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు. మంత్రి సురేశ్ ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. అభివృద్ధి పనులు పూర్తి చేయలేని అసమర్థుడని ఆరోపించారు.

tension at Chandrababu tour
tension at Chandrababu tour
author img

By

Published : Apr 21, 2023, 6:46 PM IST

Updated : Apr 21, 2023, 9:21 PM IST

యర్రగొండపాలెంలో హై టెన్షన్

Tension at Chandrababu Yerragondapalem TOUR: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వాహనంపై.. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ క్యాంపు కార్యాలయం వద్ద వైకాపా నాయకులు, కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీనిపై తీవ్రంగా ఆందోళన చెందిన ఎన్​ఎస్​జి కమెండోలు.. చంద్రబాబుపై రాళ్లు పడకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డు పెట్టారు. ఈ ఘటనలో రాయి పడి కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఉన్న కార్యకర్తకు గాయమైంది. వైకాపా నాయకులు రాళ్లు విసరడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, మా జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రాళ్లు విసిరిన ఘటనపై నిరసన వ్యక్తంచేస్తున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఈ సందర్భంగా పోలీసులు పక్కకు తోసేశారు. పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్యే చంద్రబాబు కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు సాగిపోయింది.

చంద్రబాబు రావడానికి ముందు యర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామంటూ మంత్రి సురేశ్ ఆధ్వర్యాన వైకాపా నాయకులు, కార్యకర్తలు రోడ్డుమీదికి వచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. మంత్రి సురేశ్ కార్యాలయం వద్ద వైకాపా కార్యకర్తలు గుమికూడారు. ఇంకోవైపు అధినేతకు స్వాగతం పలికేందుకు మన్నె రవీంద్ర నాయకత్వంలో భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. మంత్రి సురేశ్​తో పాటు వైకాపా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల వారు పోటాపోటీ నినాదాలు చేశారు. పోలీసులు తమను నిలువరించడంపై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళుతుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక కవ్వింపులకు దిగిన మంత్రి సురేశ్ ను.. కొద్దిసేపటి తర్వాత ఆయన క్యాంపు కార్యాలయంలో పోలీసులు పంపించివేశారు. ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలుసుకున్న ఎన్​ఎస్​జి.. యర్రగొండపాలెంకు అదనపు బలగాలను పంపించింది.

తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదవారికి అండగా ఉంటుందని బహిరంగ సభలో చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగు బాగా పెరిగిందని.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం చేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వైకాపా పాలనలో రౌడీలు రోడ్డు మీదకు వస్తున్నారన్న చంద్రబాబు.. నా ముందు కుప్పిగంతులు వేయవద్దని హెచ్చరించారు. జగన్‌ లాంటి రాజకీయ నాయకుడిని దేశంలో ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు. మంత్రి సురేశ్ ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. అభివృద్ధి పనులు పూర్తి చేయలేని అసమర్థుడని ఆరోపించారు.

యర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. వర్షం వల్ల నిర్దేశించిన స్థలంలో కాకుండా మరోచోట బహిరంగ సభ నిర్వహించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 21, 2023, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.