ETV Bharat / bharat

కరీంనగర్​లో అర్ధరాత్రి హైడ్రామా.. ఉద్రిక్తతల నడుమ బండి సంజయ్ అరెస్టు - Bandisanjay arrested on TSPSC paper leakage

Bandi Sanjay arrested: కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నడుమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌ వాహనంలో తరలించారు. ఎందుకు అరెస్టు చేశారనే విషయంపై పోలీసుల నుంచి స్పష్టత రాలేదు. పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి మీడియా సమావేశం పెడతారనే సమాచారంతోనే తమ నేతను అరెస్ట్‌ చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Bandi Sanjay arrested
Bandi Sanjay arrested
author img

By

Published : Apr 5, 2023, 6:38 AM IST

Updated : Apr 5, 2023, 7:01 AM IST

కరీంనగర్​లో ఉద్రిక్తత.. అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్ అరెస్టు

Bandi Sanjay arrested: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి సమయంలో కరీంనగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు సంజయ్‌ అత్తమ్మ వాళ్ల ఇంటికి చేరుకున్నారు. సంజయ్‌ అత్తమ్మ ఇటీవల చనిపోగా.. 9 రోజుల కార్యక్రమం బుధవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జ్యోతినగర్‌లోని వారి ఇంటికి సంజయ్‌ వచ్చారన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. లోపలికి వెళ్లి సంజయ్‌ను స్టేషన్‌కు రావాల్సిందిగా ఏసీపీ కోరారు.

Bandi Sanjay arrest in Karimnagar : ఎందుకు రావాలి? ఏ కేసులో తనను తీసుకెళ్తున్నారని సంజయ్‌ ప్రశ్నిస్తూ ఇంట్లో నుంచి కదలకుండా మొండికేశారు. తనను అరెస్ట్ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం అందించారా? అని ప్రశ్నించారు. పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తానన్న ఉద్దేశంతోనే అదుపులోకి తీసుకుంటున్నారా అని నిలదీశారు. తనను ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాచారం తెలియజేయాలని కోరుతుండగానే పోలీసు స్టేషన్‌కు వెళ్లాక విషయం చెబుతామంటూ పోలీసులు బలవంతంగా సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Bandi Sanjay Comments on SSC Paper Leak : ఈ క్రమంలో పోలీసులకు, సంజయ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆయన ప్రతిఘటిస్తున్నప్పటికీ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. పోలీసు వాహనంలో ఆయనను తరలించారు. ఈ క్రమంలో ఎల్​ఎండీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు వాహనం మొరాయించడంతో మరో వాహనంలోకి ఎక్కించారు. పోలీసులు బలవంతంగా బండి సంజయ్‌ను వ్యాన్‌లో ఎక్కించుకు వెళుతుండగా పోలీసులను అడ్డుకునేందుకు కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు.

పోలీసు తీరుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ అని చూడకుండా బలవంతంగా తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సంజయ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారనే విషయమై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గతంలో గ్రూప్‌-1 ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో సంజయ్‌ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి సిట్‌ రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకాకుండా సంజయ్‌ తన లీగల్‌ టీమ్‌ను పంపించారు. మరోవైపు పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ఎంపీని అరెస్ట్‌ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రెస్‌మీట్‌ పెడతారనే సమాచారంతోనే తమ నేతను అరెస్ట్‌ చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

కమలాపూర్‌ పాఠశాల నుంచి హిందీ ప్రశ్నపత్రం బయటికొచ్చిందిలా: సీపీ

ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే.. శాశ్వతంగా తొలగింపు: సబితా ఇంద్రారెడ్డి

పదో తరగతి జవాబుపత్రాలు మాయం.. కొనసాగుతున్న గాలింపు.. ఇద్దరు ఉద్యోగులపై వేటు

Last Updated : Apr 5, 2023, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.