ETV Bharat / bharat

బాలుడి అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు!.. తల్లిదండ్రుల 'నూడిల్స్' సాకు - నూడిల్స్​ తిని బాలుడు మృతి

తమిళనాడులో ఓ బాలుడు ఆకస్మికంగా మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. నూడిల్స్ తినడం వల్లే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, చిన్నారి శరీరంపై గాయాలు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందంటే?

2-year-old boy died after eating Noodles

author img

By

Published : Jun 20, 2022, 3:35 PM IST

Updated : Jun 20, 2022, 10:51 PM IST

Two Years Boy Died Eating Noodles: తమిళనాడు తిరుచ్చి జిల్లాలో రెండేళ్ల బాలుడి ఆకస్మిక మరణం.. అనేక అనుమానాలకు తావిచ్చింది. ఫ్రిజ్​లో పెట్టిన నూడిల్స్ తినడం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు చెప్పినా.. అతడి శరీరంపై గాయాలు ఉండడం చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అవసరమైతే హత్య కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

2-year-old boy died after eating Noodles
మృతి చెందిన చిన్నారి

ఇదీ జరిగింది.. జిల్లాలోని సమయపురానికి చెందిన శేఖర్-మహాలక్ష్మి దంపతులకు సాయి తరుణ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి కొంత కాలంగా వివిధ అలెర్జీ సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకు తగ్గ చికిత్స పొందుతున్నాడు. అయితే శుక్రవారం(జూన్ 17) రాత్రి బాలుడి తల్లి మహాలక్ష్మి.. నూడిల్స్ వండింది. ముగ్గురూ తిన్నాక మిగిలిన నూడిల్స్​ ఫ్రిజ్‌లో ఉంచింది. మరుసటి రోజు శనివారం (జూన్ 18) అదే నూడిల్స్​ను తరుణ్​కు అల్పాహారంగా పెట్టింది.

అది తిన్నాక ఇంట్లోనే తరుణ్.. వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వెంటనే చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే, చిన్నారి శరీరంపై గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో బాలుడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు విషయం ఏదైనా దాస్తున్నారా అని పోలీసులు సందేహిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బాలుడి శరీరానికి గాయాలైన విషయం తనకు తెలియదని అతడి తల్లి మహాలక్ష్మి చెబుతోంది. అయితే, రెండ్రోజుల నుంచి బాలుడికి ఆరోగ్యం బాలేదని ఇదివరకు ఆమె చెప్పింది. అనారోగ్యంతో ఉన్న బాలుడిని చూసుకుంటున్న ఆమె.. చిన్నారి ఒంటిపై గాయాలను గమనించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గాయాల వల్లే బాలుడు చనిపోయాడా అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే నిజానిజాలు తెలుస్తాయని అన్నారు.

ఇవీ చదవండి: ఫ్లైట్​లో మంటలు.. గాల్లో 185 ప్రాణాలు.. 'సూపర్​ ఉమన్' మోనిక చాకచక్యంగా...

రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ.. డ్రైవర్​ పరార్​.. బాధితుడు అక్కిడక్కడే..

Last Updated : Jun 20, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.