ETV Bharat / bharat

Acid Attack: అనుమానమే పెనుభూతం- భార్యపై యాసిడ్​ దాడి - యాసిడ్​ దాడి వార్తలు

వివాహేతర సంబంధం (Extramarital affairs) ఉందనే అనుమానంతో భార్యపై యాసిడ్​ దాడికి (Acid Attack) పాల్పడ్డాడు ఓ భర్త. ఈ దాడిలో పక్కన ఉన్న కుమార్తెలకు కూడా తీవ్రగాయాలయ్యాయి.

man throws acid on wife
భార్యపై యాసిడ్​ దాడి
author img

By

Published : Sep 11, 2021, 11:15 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని కుంద్రాఘాట్​లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే.. భార్యపై యాసిడ్​ దాడికి (Acid Attack) పాల్పడ్డాడు. పక్కన కన్న బిడ్డలు ఉన్నారనే.. కనికరం కూడా లేకుండా యాసిడ్​ పోశాడు. వారి ఆర్తనాదాలను విని తరించి.. రాక్షసానందం పొందాడు. అత్యంత హృదయ విధారకరమైన ఈ ఘటనకు వివాహేతర సంబంధం (extramarital affairs) ఉందనే అనుమానమే కారణమని పోలీసుల విచారణలో తేలింది.

ఇదీ జరిగింది..

కుంద్రాఘాట్​లో ఉండే అజయ్​ సాహిని అనే వ్యక్తి.. తన భార్యకు వివాహేతర సంబంధం (extramarital affairs) ఉందనే కారణంతో ఆమెపై యాసిడ్​ పోశాడు. ఈ ఘటనలో పక్కన ఉన్న ఇద్దరు కుమార్తెలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. భార్య, పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో కుమార్తె ప్రథమ చికిత్స అనంతరం కోలుకుని డిశ్ఛార్జ్​ అయినట్లు పేర్కొన్నారు.

నిందితుడు అజయ్​ సాహినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిసైన అజయ్​ తరుచూ భార్యను అనుమానించే వాడని స్థానికులు తెలిపారు. దీనిపై రెండురోజులుగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆమెపై యాసిడ్​ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 34 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై రాడ్​తో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.