ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో మరోసారి డ్రోన్ల కలకలం - డ్రోన్ల దాడి

జమ్ముకశ్మీర్​లోని మూడు ప్రాంతాల్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో డ్రోన్లు సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రోన్లు పాకిస్థాన్​కు చెందినవిగా అనుమానిస్తున్నారు.

drones
డ్రోన్​ల కలకలం
author img

By

Published : Jul 30, 2021, 8:37 AM IST

జమ్ముకశ్మీర్​ సరిహద్దులో మరోమారు డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో సాంబా సెక్టార్​లోని మూడు ప్రాంతాల్లో డ్రోన్లు చక్కర్లు కొట్టినట్లు అధికారులు తెలిపారు. బారిబ్రాహ్మణ, చిలడ్యా, గగ్వాల్​ ప్రాంతంలో డ్రోన్లను గుర్తించామన్నారు.

చిలడ్యాలో చక్కర్లు కొడుతున్న డ్రోన్​పై బీఎస్​ఎఫ్​ బలగాలు కాల్పులు జరపగా.. ఆ డ్రోన్​ పాకిస్థాన్ వైపునకు వెళ్లినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరో రెండు డ్రోన్లు గాల్లోనే కనుమరుగైనట్లు తెలిపారు. ఈ డ్రోన్లు పాకిస్థాన్​కు చెందినవిగా అధికారులు అనుమానిస్తున్నారు. వీటిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు.

ఇవీ చదవండి:

కశ్మీర్​కు బాంబులతో మరో డ్రోన్- కూల్చేసిన పోలీసులు

భారత్​కు పెనుముప్పుగా డ్రోన్లు

పాక్​లోని ఇండియన్ ఎంబసీ వద్ద డ్రోన్‌ కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.